పాఠశాలలకు సెలవులు పొడిగించిన ఏపీ ప్రభుత్వం..

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 757 కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి బారిన పడి 22 మంది మృతి చెందారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ చిన వీరభద్రుడు ఉత్తర్వులను జారీ చేశారు. వాస్తవానికి ఈ విద్యా […]

పాఠశాలలకు సెలవులు పొడిగించిన ఏపీ ప్రభుత్వం..
Follow us

|

Updated on: Apr 22, 2020 | 12:17 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 757 కేసులు నమోదు కాగా.. ఈ మహమ్మారి బారిన పడి 22 మంది మృతి చెందారు. ఈ తరుణంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు మే 3 వరకూ సెలవులను పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ చిన వీరభద్రుడు ఉత్తర్వులను జారీ చేశారు. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరం రేపటితో ముగియనుంది. అయితే కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్ధులకు పరీక్షలు నిర్వహించకుండానే మరోమారు సెలవులను పొడిగించింది. ఇక మే 3 తర్వాత అప్పటి పరిస్థితిని సమీక్షించి సెలవులు పొడిగించాలా.? లేక పరీక్షలు నిర్వహించాలా.? అనే దానిపై ఓ నిర్ణయానికి వస్తామని ఉన్నతాధికారులు తెలిపారు. కాగా, లాక్ డౌన్ వల్ల ఏపీలో టెన్త్ పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Also Read:

కిమ్ కంటే యమ డేంజరట.. ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.!

జూన్ 1 వరకూ లాక్‌డౌన్‌.. సర్కార్ కీలక నిర్ణయం..

కరోనా వేళ.. పాక్‌కు గట్టి షాక్.. క్వారంటైన్‌కు ఇమ్రాన్ ఖాన్.!

మనసున్న మారాజు.. పేదవాళ్లకు అద్దె మాఫీ చేసిన టీఆర్ఎస్ నేత..

కరోనా కాలంలో జగన్ మరో కీలక నిర్ణయం..

గుడ్ న్యూస్.. ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..

మందుబాబులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న మద్యం షాపులు.. కానీ..

లాక్‌డౌన్‌ నుంచి వీటికి కూడా మినహాయింపు.. కేంద్రం తాజా ఆదేశాలు..

లాక్‌డౌన్‌ బేఖాతర్.. వందల సంఖ్యలో గుమిగూడి కరోనా పూజలు..

అక్కడ లాక్ డౌన్ పాటించకపోతే.. రూ. 23,000 ఫైన్…