Delmicron: కరోనా కొత్త వేరియంట్‌ డెల్మిక్రాన్‌.. వేగంగా విస్తరిస్తోంది.. 3 స్థానంలో తెలంగాణ

| Edited By: Ravi Kiran

Dec 21, 2021 | 7:23 AM

Delmicron: దేశంలో కరోనా డెల్టావేరియంట్‌. ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తున్నాయి. అందుకే ఈ రెండింటిని కలిపి డెల్మిక్రాన్ అని పేరు పెట్టారు. డెల్టా వేరియంట్,

Delmicron: కరోనా కొత్త వేరియంట్‌ డెల్మిక్రాన్‌.. వేగంగా విస్తరిస్తోంది.. 3 స్థానంలో తెలంగాణ
Delmicron
Follow us on

Delmicron: దేశంలో కరోనా డెల్టావేరియంట్‌. ఒమిక్రాన్‌ వేగంగా విస్తరిస్తున్నాయి. అందుకే ఈ రెండింటిని కలిపి డెల్మిక్రాన్ అని పేరు పెట్టారు. డెల్టా వేరియంట్, ఓమిక్రాన్ వేరియంట్ కలపడం ద్వారా ఈ నామకరణం చేశారు. ఎందుకంటే ప్రస్తుతం రెండు రకాల కరోనా వైరస్‌లు భారతదేశంతో సహా అన్ని దేశాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈరోజు కేరళలో నాలుగు, ఢిల్లీలో రెండు కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇండియాలో ఓమిక్రాన్ సోకిన వారి సంఖ్య 166 కి చేరుకుంది. ఆదివారం ఒక్కరోజే 14 కొత్త కేసులు నమోదయ్యాయి.

ప్రస్తుతం మహారాష్ట్రలో అత్యధికంగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో, తెలంగాణ మూడో స్థానంలో, కర్ణాటక 4వ స్థానంలో, కేరళ ఐదో స్థానంలో ఉన్నాయి. అయితే శుభవార్త ఏమిటంటే కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్‌తో పోరాడటానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సన్నాహాలు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య రాజ్యసభలో వెల్లడించారు. దేశంలో పెరుగుతున్న ఓమిక్రాన్ కేసుల వల్ల భారతదేశం ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు.

దేశంలో ఈ కొత్తవేరియంట్ ఫిబ్రవరిలో అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ భయాందోళనకు కారణం ఏంటంటే కేవలం 27 రోజుల్లో అమెరికా, బ్రిటన్ దేశాలలో విపరీతమైన కేసులు నమోదయ్యాయి. అమెరికాలోని 92 నగరాల్లో ఐసీయూలు దాదాపు నిండిపోయాయి. తక్కువ లక్షణాలున్న రోగులను ఇంటికి పంపుతున్నారు. బ్రిటన్‌లో ఒక్కరోజులో 10 వేలకు పైగా ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 12 మంది రోగులు మరణించారు. ఇక్కడ క్రిస్మస్ ముందు లాక్‌డౌన్ విధించే అవకాశం ఉంది. ప్రపంచంలోని 80 కంటే ఎక్కువ దేశాలు ఈ వైరస్ బారిన పడ్డాయి. రియు ప్రపంచవ్యాప్తంగా 62 వేల మందికి పైగా ప్రజలు ఓమిక్రాన్ బారిన పడ్డారు.

BEL Recruitment 2021: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

పోలీసులు లంచం తీసుకుంటే పని కచ్చితంగా చేస్తారట.. ఈ విషయం పోలీస్‌ అధికారే చెబుతున్నాడు.. వీడియో చూడండి..

Vastu Tips: వాస్తు ప్రకారం ఇంట్లో ఈ వస్తువులు ఉండాలి.. అదృష్టం, సంతోషం అన్నీ మీ వెంటే..