AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్.. శాస్త్రవేత్తల హెచ్చరిక

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్ తెలిపారు. వేసవిలో ఈ వైరస్‌ని నియంత్రించకపోతే శీతాకాలంలో

కరెన్సీ నోట్లపై 28 రోజుల పాటు కరోనా వైరస్.. శాస్త్రవేత్తల హెచ్చరిక
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 12, 2020 | 4:33 PM

Share

Coronavirus currency notes: ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా గురించి ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు మరో షాకింగ్ న్యూస్ తెలిపారు. వేసవిలో ఈ వైరస్‌ని నియంత్రించకపోతే శీతాకాలంలో మరింత ముదిరే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. దీని వలన వాతావరణంలో వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉంటుందని, రానున్న రోజుల్లో మరిన్ని గడ్డు పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన కాన్సాస్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల ప్రకారం.. చల్లటి వాతావరణంలో వైరస్ ఎక్కువ కాలం జీవించి ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో కరెన్సీ నోట్లు, మృదువైన గాజు పరికరాలు, మొబైల్ టచ్ స్క్రీన్‌పై 28 రోజుల పాటు వైరస్ నిలిచి ఉంటుందని, ఇది చాలా ప్రమాదకరమని అందులో పాల్గొన్న పరిశోధకులు చెబుతున్నారు. కరెన్సీ ఒకరి చేత నుంచి మరొకరికి మారే కొద్ది వైరస్ ప్రభావం పొంచి ఉన్నట్లేనని వారు అంటున్నారు. వేస‌విలో స‌గ‌టు ఉష్ణోగ్రతతో పోలిస్తే శీతాకాలం వాతావ‌ర‌ణంలో కరోనా వైరస్‌ ఐదు రెట్లు బ‌లంగా ఉంటుంద‌ని ఈ అధ్యయనంకు నాయకత్వం వహించిన వైరాలజిస్ట్ జుర్జెన్ రిచ్ట్ తెలియ‌జేశారు. అందుకే శీతాకాలంలో కరోనా పరిస్థితిని కట్టడి చేయడం అతిపెద్ద స‌వాలు అని తెలిపారు. 40 డిగ్రీల సెల్సియస్ వద్ద కొన్ని ఉపరితలాలపై వైరస్  ఒక రోజు కూడా జీవించలేదని, కానీ వాతావరణం చల్లబడినప్పుడు ఎక్కువ రోజులు బతికే అవకాశం ఉందని వారు చెబుతున్నారు.

Read More:

సెట్స్‌పైకి వెళ్లిన నాగశౌర్య, రీతూ వర్మ

‘ఎఫ్‌ 3’లో కీలక పాత్రలో సునీల్‌..!

Follow Us
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
కేబుల్‌ బ్రిడ్జ్‌పై బెంజ్‌ కారు బీభత్సం.. యువకుడు మృతి
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
ఈ నాలుగు రాశుల వారు వజ్రం ధరిస్తే.. జీవితంలోనే ఊహించని మార్పు!
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
సంస్కృతం జాతి ఆత్మ - ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
100 అడుగుల లోయలో పడిన ఆర్టీసీ బస్సు.. స్పాట్‌లోనే 15 మంది మృతి
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
లీటర్ పెట్రోల్ రూ. 82 మాత్రమే.. ఎక్కడో తెలుసా..? మన దేశంలోనే..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
నేను రోడ్డున పడ్డప్పుడు వచ్చి కలిసిన ఏకైక నటుడు అతను..
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
పోలీస్, ఆర్మీ అధికారుల యూనిఫామ్‌పై ఈ తాడు ఎందుకు ఉంటుందో తెలుసా?
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. 9 రోజులు క్లోజ్! లిస్ట్ ఇదే!
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిన శ్రేయాస్ అయ్యర్ టీం..
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ
NEET UG 2026 పరీక్షకు డ్రెస్ కోడ్ తప్పరిసరి.. ఇలాచేస్తే నో ఎంట్రీ