బ్రేకింగ్: దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం

| Edited By:

May 05, 2020 | 8:14 PM

కరోనా వైరస్ వ్యాప్తితో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దేశ వ్యాప్తంగా జరగాల్సిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఈశాన్య ఢిల్లీ మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి..

బ్రేకింగ్: దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం
Follow us on

కరోనా వైరస్ వ్యాప్తితో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. దేశ వ్యాప్తంగా జరగాల్సిన సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల నిర్వహణపై కీలక ప్రకటన చేశారు కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఈశాన్య ఢిల్లీ మినహా కేంద్ర విద్యాలయాల్లో విద్యనభ్యసిస్తున్న వారికి పెండింగ్‌లో ఉన్న పదో తరగతి వార్షిక పరీక్షలను నిర్వహించబోమని చెప్పారు. ఈశాన్య ఢిల్లీకి చెందిన విద్యార్థులు మాత్రం పరీక్షల రాయాలని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి. కాగా ఈశాన్య ఢిల్లీ విద్యార్థులకు మాత్రం.. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు 10 రోజుల సమయం ఇస్తామని ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు పోఖ్రియాల్.

కాగా కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్, ఎంసెట్, ఇతర ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మే నెల చివరిలో నిర్వహించే అవకాశం ఉందని భావించారు. లాక్‌డౌన్ సడలించిన తర్వాత పదో తరగతి పరీక్షల నిర్వహణకు రెండు వారాల సమయం పట్టనుందని అనుకన్నారు. కానీ తాజాగా ప్రకటించిన ప్రకటనతో దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ టెన్త్ క్లాస్ పరీక్షలపై ఓ క్లారిటీ వచ్చింది.

Read More:

సిటీ డీసీపీకి కరోనా.. పోలీసుల్లో మొదలైన కలవరం!

విద్యార్థులను నేరుగా పై తరగతికి ప్రమోట్ చేసిన ప్రభుత్వం

తెలంగాణలో జూన్ 12 నుంచి స్కూల్స్ ఓపెన్.. ఒక్కో గదిలో 20 మందే!

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..