ఏపీలో తగ్గిన కరోనా మరణాలు.. పెరిగిన రికవరీ కేసులు..
Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,986 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,83,132కి చేరింది. ఇందులో 36,474 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,40,229 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 23 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,429కు చేరుకుంది. ఇక నిన్న 4,591 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు […]
Coronavirus Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,986 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,83,132కి చేరింది. ఇందులో 36,474 యాక్టివ్ కేసులు ఉండగా.. 7,40,229 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న వైరస్ కారణంగా 23 మంది మృతి చెందటంతో.. మొత్తం మరణాల సంఖ్య 6,429కు చేరుకుంది. ఇక నిన్న 4,591 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 201, చిత్తూరు 458, తూర్పుగోదావరి 481, గుంటూరు 496, కడప 266, కృష్ణా 503, కర్నూలు 55, నెల్లూరు 196, ప్రకాశం 334, శ్రీకాకుళం 168, విశాఖపట్నం 218, విజయనగరం 82, పశ్చిమ గోదావరి 528 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కాగా, తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,10,092కి చేరింది. అలాగే చిత్తూరులో అత్యధికంగా 741 మంది కరోనాతో మరణించారు.