కరోనా వైరస్ వ్యాప్తిపై ఎయిమ్స్ వైద్యుల నివేదిక
కరోనా వైరస్ వ్యాప్తి ముఖ్యంగా మనుషుల నుంచి మనుషులకే వ్యాప్తి చెందుతుంది. ఇతర వాహకాల గురించి సంబంధించిన అపోహలపై తాజాగా ఏయిమ్స్ వైద్యులు స్పష్టతనిచ్చారు. కోవిడ్-19 ఎక్కడో చైనాలోని వుహన్‌లో పుట్టి ప్రపంచ దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. కరోనా కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలు తప్పించుకునేందు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మహమ్మారి కరోనా అనేక రూపాల నుంచి విస్తరిస్తుందని ప్రచారం ఉంది. తాజాగా పెంపుడు జంతువుల నుంచి కరోనా విస్తరిస్తుందా లేదా అనేదానిపై ప్రఖ్యాత ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ […]
కరోనా వైరస్ వ్యాప్తి ముఖ్యంగా మనుషుల నుంచి మనుషులకే వ్యాప్తి చెందుతుంది. ఇతర వాహకాల గురించి సంబంధించిన అపోహలపై తాజాగా ఏయిమ్స్ వైద్యులు స్పష్టతనిచ్చారు. కోవిడ్-19 ఎక్కడో చైనాలోని వుహన్‌లో పుట్టి ప్రపంచ దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంది. కరోనా కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలు తప్పించుకునేందు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. మహమ్మారి కరోనా అనేక రూపాల నుంచి విస్తరిస్తుందని ప్రచారం ఉంది. తాజాగా పెంపుడు జంతువుల నుంచి కరోనా విస్తరిస్తుందా లేదా అనేదానిపై ప్రఖ్యాత ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఏయిమ్స్) వైద్యులు స్పష్టతనిచ్చారు.
నోవెల్ కరోనా వైరస్ ఎలా సంక్రమిస్తుందనే దానిపై ఎయిమ్స్ వైద్యులు అధ్యయం జరిపారు. ఈ మేరకు ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు మాత్రమే వ్యాపిస్తుందని స్పష్టం చేశారు. సార్స్, మెర్స్‌లాగా కాకుండా ఇది కేవలం హ్యూమన్ వైరస్ అని పేర్కొంది. ఇప్పటివరకు వెల్లడైన పరిశోధనల్లో పెంపుడు జంతువుల నుంచి కరోనా వ్యాపిస్తుందని తేలలేదని ఏయిమ్స్ డైరెక్టర్ డా.రణదీప్ గులేరియా వెల్లడించారు. ఈ వైరస్ కేవలం మనుషుల నుంచి మనుషులకే వ్యాపిస్తుందని, జంతువుల నుంచి మనుషులకు సోకే అవకాశాలు లేవని చెప్పారు. దీంతో ఇళ్లల్లో పెంపుడు జంతువులు పెంచుకుంటున్న వారందరికీ ఊరటనిచ్చినట్లయ్యింది.