బ్రేకింగ్ న్యూస్.. మర్కజ్‌ ఒక్కటే కాదు.. ఆ దర్గాకు వెళ్లిన వారికి సైతం కరోనా..!

బ్రేకింగ్ న్యూస్.. మర్కజ్‌ ఒక్కటే కాదు.. ఆ దర్గాకు వెళ్లిన వారికి సైతం కరోనా..!

నిర్మల్ జిల్లాలో మరో కలకలం రేగింది. ఇప్పటికే మర్కజ్ వెళ్లి వచ్చిన పలువురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరో విషయం ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.మర్కజ్‌ వెళ్లినవారికే కరోనా వచ్చే అవకాశం ఉందని.. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడికి వెళ్లి వచ్చిన వారిని గుర్తిస్తూ కరోనా టెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. మర్కజ్‌ సమావేశాలకే కాదు.. యూపీలోని దేవ్‌ బంధ్ దర్గాకు వెళ్లి వచ్చన వారికి కూడా కరోనా […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 13, 2020 | 3:36 PM

నిర్మల్ జిల్లాలో మరో కలకలం రేగింది. ఇప్పటికే మర్కజ్ వెళ్లి వచ్చిన పలువురికి కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా.. మరో విషయం ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.మర్కజ్‌ వెళ్లినవారికే కరోనా వచ్చే అవకాశం ఉందని.. ముందస్తు జాగ్రత్తగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడికి వెళ్లి వచ్చిన వారిని గుర్తిస్తూ కరోనా టెస్టులు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా.. మర్కజ్‌ సమావేశాలకే కాదు.. యూపీలోని దేవ్‌ బంధ్ దర్గాకు వెళ్లి వచ్చన వారికి కూడా కరోనా వచ్చినట్లు తెలుస్తోంది. మర్కజ్‌తో పాటు ఇప్పుడు తెరపైకి ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌బంద్‌ దర్గా నుంచి కూడా ఈ కరోనా వ్యాప్తి జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జిల్లాకు చెందిన ముగ్గురు వ్యక్తులు.. మర్కజ్‌తో పాటు.. ఉత్తర్ ప్రదేశ్ లోని దేవ్‌బంద్ దర్గాకు వెళ్లి వచ్చిన విషయాన్నిగోప్యంగా ఉంచడంతో.. ఆ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరలో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. వీరిపై ఐపీసీ సెక్షన్‌ 269,270,271, సెక్షన్-3 ఎపిడమిక్ యాక్ట్ 1897తో పాటు.. 54 of నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్మెంట్ 2005 కింద కేసులు నమోదు చేశారు.

అయితే.. పాజిటివ్ వచ్చిన సదరు వ్యక్తి.. పలు అధికారిక కార్యక్రమాలకు, రివ్యూ మీటింగ్‌లకు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యక్తిని కలిసిన వారిలో పలువురు జిల్లాకు చెందిన అధికారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు.. ఆయన జిల్లాలో పలు కీలక ఉన్నతాధికారులను సైతం కలిశారన్నట్లు  సమాచారం. దీంతో ఇప్పుడు ఆయన ఎవరెవరిని కలిశారన్న కాంటాక్ట్‌ గురించి అధికారులు ఆరా తీస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu