Corona Positive Cases AP: ఏపీలో కొత్తగా 179 కరోనా పాజిటివ్ కేసులు.. జిల్లాల వారీగా వివరాలివే..
Corona Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 39,099 శాంపిల్స్ పరీక్షించగా.. 179 పాజిటివ్ కేసులు..
Corona Positive Cases AP: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 39,099 శాంపిల్స్ పరీక్షించగా.. 179 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,86,245కు చేరింది. ఇందులో 1660 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,77,443 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు నిన్న గుంటూరులో కరోనా కారణంగా ఒకరు మృతి చెందగా.. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 7142కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 231 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.
కాగా, నిన్న జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి.. అనంతపురం 4, చిత్తూరు 40, తూర్పుగోదావరి 15, గుంటూరు 24, కడప 9, కృష్ణా 35, కర్నూలు 11, నెల్లూరు 3, ప్రకాశం 4, శ్రీకాకుళం 6, విశాఖపట్నం 18, విజయనగరం 1, పశ్చిమ గోదావరి 9 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.