గాంధీలో ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..!

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ 19 బాధితులకు ప్లాస్మా థెరపీ సంజీవనిలా మారింది. క్రిటికల్ కండిషన్‌లో ఉన్న పేషంట్లకు ప్రయోగాత్మకంగా ప్లాస్మా థెరపీని చేపడుతుంటే సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ కరోనా బాధితుడికి రెండుసార్లు ప్లాస్మా ఎక్కించగా.. అతడు ప్రస్తుతం వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంటున్నాడని అక్కడి వైద్యులు తెలియజేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆదేశాలతో గాంధీ […]

గాంధీలో ఫలించిన ప్లాస్మా థెరపీ.. కోలుకున్న కరోనా బాధితుడు..!
Follow us

|

Updated on: May 24, 2020 | 6:19 PM

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న వేళ.. కోవిడ్ 19 బాధితులకు ప్లాస్మా థెరపీ సంజీవనిలా మారింది. క్రిటికల్ కండిషన్‌లో ఉన్న పేషంట్లకు ప్రయోగాత్మకంగా ప్లాస్మా థెరపీని చేపడుతుంటే సత్ఫలితాలను ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న ఓ కరోనా బాధితుడికి రెండుసార్లు ప్లాస్మా ఎక్కించగా.. అతడు ప్రస్తుతం వైరస్ నుంచి పూర్తిగా కోలుకుంటున్నాడని అక్కడి వైద్యులు తెలియజేశారు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) ఆదేశాలతో గాంధీ డాక్టర్లు కొద్దిరోజుల కిందట దాతల నుంచి ప్లాస్మాను సేకరించారు. వెంటిలేటర్‌పై ఉన్న ఆరుగురి కరోనా బాధితులను ఎంపిక చేసి వారి వివరాలను ఐసీఎంఆర్‌కు పంపారు.

అక్కడి నుంచి ఆదేశాలు రావడంతో పాతబస్తీకి చెందిన 44 ఏళ్ల బాధితునికి ఈనెల 14న 200 ఎంఎల్‌ ప్లాస్మాను ఎక్కించగా.. బాధితుడు కోలుకుంటుండటంతో.. ఐసీఎంఆర్ నిబంధనల ప్రకారం.. రెండో డోస్ కింద మరో 200 ఎంఎల్ ప్లాస్మాను ఈ నెల 16న గాంధీ వైద్యులు అతనికి ఎక్కించారు. సదరు పేషంట్ ప్రస్తుతం కోలుకుంటున్నాడని.. రెండు మూడు రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు నలుగురు దాతలు ప్లాస్మా డొనేట్ చేసినట్లు ఆసుపత్రి యంత్రాంగం అధికారికంగా ప్రకటించింది.

ఇది చదవండి: తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. వారికి కూడా రూ.1500 సాయం..