ప్లాస్మా థెరపీతో కోలుకున్న60 ఏళ్ల వృద్ధుడు
మందులేని మహమ్మారిపై ప్రపంచ దేశాలు అలుపెరుగని యుద్ధం చేస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవటంతో పలు రకాల మందులతో కోవిడ్ బాధితులకు చికిత్సనందిస్తున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా బాధితుల పాలిట ఆశాదీపంగా కనిపిస్తున్న ప్లాస్మా థెరపీతో ఓ అరవై ఏళ్ల వ్యక్తి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు.

మందులేని మహమ్మారిపై ప్రపంచ దేశాలు అలుపెరుగని యుద్ధం చేస్తున్నాయి. ఇప్పటి వరకు సరైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవటంతో పలు రకాల మందులతో కోవిడ్ బాధితులకు చికిత్సనందిస్తున్నారు. ఇటువంటి తరుణంలో కరోనా బాధితుల పాలిట ఆశాదీపంగా కనిపిస్తున్న ప్లాస్మా థెరపీతో ఓ అరవై ఏళ్ల వ్యక్తి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. చంఢగీడ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఆస్పత్రి వైద్యులు ఆ వృద్ధుడికి ప్లాస్మా థెరపీ చికిత్స చేసి కరోనా నుంచి కోలుకునేలా చేశారు.
కురుక్షేత్రకు చెందిన 60 ఏళ్ళ వ్యక్తి నిమోనియా కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై వెంటిలేటర్ అవసరమైన స్థితిలో ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు అతడికి ప్లాస్మా థెరపీ, ఇతర చికిత్సలు అందించారు. ఫలితంగా మూడు రోజుల్లోనే స్వతహాగా శ్వాస తీసుకునే స్థితికి చేరడంతో వెంటిలేటర్ తొలగించారు. అనంతరం పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కరోనా వైరస్ బారినపడి తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి మాత్రమే ప్లాస్మా చికిత్స అందిస్తారు. ప్లాస్మా థెరపీ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ ఎంచుకున్న ఆస్పత్రుల్లో పీజీఐ కూడా ఒకటి. ఈ ఆస్పత్రిలో మే 9న మొదటి వ్యక్తి ప్లాస్మా దానం చేయగా, జూన్ 1న ప్లాస్మా థెరపీకి అవసరమైన మొదటి వ్యక్తిని గుర్తించి చికిత్స మొదలుపెట్టారు. చికిత్స అనంతరం అతను పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేసినట్లుగా అక్కడి వైద్యాధికారులు వెల్లడించారు.




