జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి పరీక్షలు చేశాకే అనుమతి..

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఏపీలో అనుమతించాలని ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి కరోనా […]

జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి పరీక్షలు చేశాకే అనుమతి..
Follow us

|

Updated on: May 29, 2020 | 3:11 PM

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసే క్రమంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎవరు వచ్చినా కూడా వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే ఏపీలో అనుమతించాలని ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసింది.

మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి..

  • మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతీ ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. నెగటివ్ వస్తే 7 రోజుల హోం క్వారంటైన్‌లో ఉండాలి. పాజిటివ్ తేలితే మాత్రం కోవిడ్ ఆసుపత్రులకు వెళ్ళాలి.
  • ఈ ఆరు హైరిస్క్ స్టేట్స్ నుంచి వచ్చిన అసింప్టమాటిక్‌ (లక్షణాలు కనిపించని) వారిని నిర్ధారణ చేసిన తర్వాతే ఇన్‌స్టిట్యూషనల్‌ క్వారంటైన్‌లో ఉంచుతారు.
  • అంతర్జాతీయ ప్రయాణాలు చేసి వచ్చిన వారికీ కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. లక్షణాలు లేని వారికి 14 రోజులు హోం క్వారంటైన్ తప్పనిసరి.
  • వృద్దులు, గర్భిణులు, 10ఏళ్ల లోపు చిన్నారులు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు నేరుగా ఇంటికి వెళ్లవచ్చు.
  • విమానాలు, రైళ్లలో ఏపీకి చేరుకునే ప్రతీ ఒక్కరికి పరీక్షలు నిర్వహిస్తారు.

Read This: ఏపీ హైకోర్టు సంచలన తీర్పుపై పవన్ ఏమన్నారంటే..!