AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీబీఎస్‌ఈ కీల‌క నిర్ణ‌యం !…10,12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు..?

సీబీఎస్ ఈ ప‌రిధిలోని 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి పెండింగ్ ప‌రీక్ష‌ల‌పై నెల‌కొన్న‌సందిగ్ధ‌త కొన‌సాగుతూనే ఉంది. 10వ తరగతి, 12వ తరగతి మినహా మిగతా తరగతుల వారిని ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్‌ చేసింది. కాగా, 12వ తరగతి పరీక్షలను జులై 1 నుంచి 15 తేదీ

సీబీఎస్‌ఈ కీల‌క నిర్ణ‌యం !...10,12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు..?
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jun 20, 2020 | 3:42 PM

Share

సీబీఎస్ ఈ ప‌రిధిలోని 10వ త‌ర‌గ‌తి, 12వ త‌ర‌గ‌తి పెండింగ్ ప‌రీక్ష‌ల‌పై నెల‌కొన్న‌సందిగ్ధ‌త కొన‌సాగుతూనే ఉంది. 10వ తరగతి, 12వ తరగతి మినహా మిగతా తరగతుల వారిని ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా పైతరగతులకు ప్రమోట్‌ చేసింది. కాగా, 12వ తరగతి పరీక్షలను జులై 1 నుంచి 15 తేదీ మ‌ధ్య‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ ప‌రీక్ష‌లు హాజరుకానున్నారు. ఈ క్ర‌మంలోనే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై కొంద‌రు విద్యార్థుల త‌ల్లిదండ్రులు సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు.

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్ర‌త కొన‌సాగుతోంది. ఈ నేప‌థ్యంలో పరీక్షలను రద్దు చేయాలంటూ కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జూన్ 17న కోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఈ సందర్భంగా సీబీఎస్‌ఈ కౌన్సిల్‌ రూపేశ్‌ కుమార్‌ కోర్టుకు విన్నవిస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తిపై బోర్డు అతి త్వరలోనే నిర్ణయం తీసుకోనుంద‌ని తెలిపారు. ఈ మేర‌కు తమ నిర్ణయాన్ని ఈ నెల 23వ తేదీలోగా తెలియజేయనున్నట్లు కోర్టుకు విన్నవించారు.

అయితే, క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో విద్యార్థుల‌కు పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాకపోవచ్చున‌ని సీబీఎస్‌ఈ యోచిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అలా అని మ‌రికొన్ని రోజులు ఎగ్జామ్స్ వాయిదా వేసే అవ‌కాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పటికే 19 రాష్ట్రాలు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాయి. అంతేకాకుండా చాలా రాష్ట్రాల్లో పలితాలు కూడా విడుదల చేశారు. దీంతో కొన్ని యూనివర్సిటీలు కొత్త అడ్మిషన్‌లకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. కాబ‌ట్టి, సీబీఎస్‌ఈ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. అందువ‌ల్ల‌ 12వ తరగతి విద్యార్థుల పరీక్షలు సైతం రద్దు చేసి ఇంటర్నల్‌ మార్కుల ఆధారంగా పాస్‌ చేసి గ్రేడ్స్‌ ఇవ్వాలనే యోచ‌న‌లో బోర్డు ఉన్న‌ట్లు స‌మాచారం.

తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
తెలంగాణకు చలి.. ఏపీకి వర్షాలు.. సంక్రాంతికి వాతావరణం ఇలా ఉంటుంది.
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
సంక్రాంతికి మరికొన్ని ప్రత్యేక రైళ్లు.. ఫుల్ డిటైల్స్ ఇదిగో..
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్..అవార్డులన్నీ గురుగ్రాంకు పార్సిల్
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
మన శంకరవరప్రసాద్ గారు సినిమా పబ్లిక్ టాక్..
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆపరేషన్‌ 2.0.. ఆ ఎన్నికలే టార్గెట్‌గా తెలంగాణపై జనసేక ఫోకస్
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఆర్డర్ చేయకుండానే ఇంటికొచ్చిన పార్శిల్.. ఓపెన్ చేసి..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
ఈ ట్రైన్‌లో వెయిటింగ్ సౌకర్యం ఉండదు.. కనీస ఛార్జ్‌ ఎంత ఉంతంటే..
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
మకరజ్యోతి దర్శనానికి సర్వం సిద్ధం.. కేవలం వారికి మాత్రమే అనుమతి
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
ఒకే మ్యాచ్‌లో 414 పరుగులు..ఢిల్లీ కోటను కూల్చిన సోఫీ
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్
విద్యార్థులకు తెలంగాణ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్