AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనా..

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో మంగళవారం 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవి 87 కాగా, 12 కేసులు వలస కూలీలకు...

తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకీ విజృంభిస్తున్న కరోనా..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 03, 2020 | 11:39 AM

Share

రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ఒక రోజు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుంటే.. మరొక రోజు తగ్గుతూ ఉన్నాయి. కాగా  తెలంగాణలో మంగళవారం 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి చెందినవి 87 కాగా, 12 కేసులు వలస కూలీలకు వచ్చినవి. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో 70 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 7, మహబూబ్‌ నగర్‌లో 1, మేడ్చల్‌ జిల్లాలో 3, జగిత్యాల జిల్లాలో1, నల్గొండ జిల్లాలో 2,మంచిర్యాల 1, సంగారెడ్డి 1,సిద్దిపేటలో 1 కేసు నమోదైంది. మంగళవారం నమోదైన కేసులతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2891కి చేరింది.

ఇక ఇవాళ కరోనా బారినపడి నలుగురు మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 92కి చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకొని 1526 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అవ్వగా.. 1273 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇక ఏపీ విషయానికొస్తే.. రాష్ట్రంలో మంగళవారం 82 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకూ కోవిడ్ కేసులు 3,200కి చేరాయి. అలాగే నిన్న 40 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 927 మంది చికిత్స పొందుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా మంగళవారం రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదని పేర్కొంది.

Follow Us
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీట్ల సంఖ్యపై అమిత్ షా క్లారిటీ!
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
వాస్తు టిప్స్ : రాత్రి అంతా ఒత్తిడి, టెన్షన్‌తో నిద్రపోవడం లేదా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
రైలు బోగీలపై పసుపు, నీలం రంగు చారలు ఎందుకు ఉంటాయో తెలుసా?
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
టేస్టీ టేస్టీ చికెన్ వెల్లుల్లి కారం పొడి.. ఇలా చేస్తే అదిరిపోతది
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
మహిళా రిజర్వేషన్: కేంద్రంపై ప్రియాంక గాంధీ ప్రశ్నల వర్షం..
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
రోజా ఈజ్ బ్యాక్.. బుల్లితెరపై రీ ఎంట్రీ ఇచ్చిన సీనియర్ నటి
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్.. మ్యాచుకు రోహిత్ దూరం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
కార్పొరేట్ కోర్టులో క్రీడా జోష్.. TV9 బ్యాడ్మింటన్ మహాసంగ్రామం
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
డిగ్రీ అర్హతతో LIC హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలకు 2026 నోటిఫికేషన
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు
ఆసియాలో రెండో వాడు.. బాబర్ ఆజం చారిత్రాత్మక రికార్డు