ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్న యూపీ సర్కార్

దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య మూడు లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా 8 వేలకు మృతుల సంఖ్య పెరిగింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయటంలో కొంత మంచి ఫలితాలు సాధిస్తోంది అక్కడి యూపీ సర్కార్. అయితే వ్యాప్తిని మరింత తగ్గించాలనే లక్ష్యంతో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పరీక్షలను విస్తృతంగా చేస్తున్నారు. గుర్తించిన వ్యక్తులను వెంటనే చికిత్సకు తరలించటం.. వారి సన్నిహితులకు హోం క్వారైంటన్ చేయటం చేస్తున్నారు. కరోనా […]

ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్న యూపీ సర్కార్
Follow us

|

Updated on: Jun 13, 2020 | 8:51 PM

దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య మూడు లక్షలు దాటింది. దేశవ్యాప్తంగా 8 వేలకు మృతుల సంఖ్య పెరిగింది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయటంలో కొంత మంచి ఫలితాలు సాధిస్తోంది అక్కడి యూపీ సర్కార్. అయితే వ్యాప్తిని మరింత తగ్గించాలనే లక్ష్యంతో కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులను గుర్తించేందుకు పరీక్షలను విస్తృతంగా చేస్తున్నారు. గుర్తించిన వ్యక్తులను వెంటనే చికిత్సకు తరలించటం.. వారి సన్నిహితులకు హోం క్వారైంటన్ చేయటం చేస్తున్నారు.

కరోనా కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్రంలో అధికంగా కేసులు నమోదవుతున్న ముజఫర్ నగర్ పై ప్రత్యేక దృష్టి  పెట్టింది. జూన్ 14 నుంచి ప్రతి ఆదివారం పూర్తి స్థాయిలో షట్ డౌన్ చేయాలని నిర్ణయించింది. వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకే  24గంటలు బంద్‌ పాటించాలని ఆ జిల్లా వాసులను ఆదేశించింది. ఉదయం 6గంటల నుంచి సోమవారం ఉద యం 6గంటల వరకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆదేశించింది. కేవలం అత్యవసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఇస్తున్నట్లుగా తెలిపింది.