AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీకి వచ్చే వారి కోసం సీఎం జగన్ న్యూ రూల్స్!

రోజూరోజుకీ ఏపీలో కరోనా వైరస్‌ల సంఖ్య పెరిగిపోతుంది. మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ విధించిన లాక్‌డౌన్ దగ్గరికి వస్తుంది. దీంతో లాక్‌డౌన్‌ సడలింపులతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి అంశంలో సరైన విధానాన్ని అవలంభించాలని..

ఏపీకి వచ్చే వారి కోసం సీఎం జగన్ న్యూ రూల్స్!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 01, 2020 | 5:33 PM

Share

రోజూరోజుకీ ఏపీలో కరోనా వైరస్‌ల సంఖ్య పెరిగిపోతుంది. మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ విధించిన లాక్‌డౌన్ దగ్గరికి వస్తుంది. దీంతో లాక్‌డౌన్‌ సడలింపులతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి అంశంలో సరైన విధానాన్ని అవలంభించాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి. సడలింపులతో పెద్ద సంఖ్యలో ఏపీకి వచ్చే అవకాశం ఉందని, వారి కోసం పక్కా ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరెవరిని ఎక్కడ పెట్టాలన్నదానిపై క్లారిటీ ఉండాలన్నారు. ఎవరిని క్వారంటైన్‌లో పెట్టాలి? ఎవరిని హోమ్‌ క్వారంటైన్‌లో ఉంచాలి? అనే దానిపై ప్రణాళిక రూపొందించాలన్నారు. క్వారంటైన్‌ సెంటర్లలో సదుపాయాలపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు జగన్.

ఈ సందర్భంగా కోవిడ్-19 నియంత్రణ ప్రత్యేకాధికారులు మాట్లాడుతూ.. మరోవైపు విదేశాల నుంచి వస్తే కనుక వారికి నాన్‌ కోవిడ్‌ సర్టిఫికెట్‌ ఉంటుందని సీఎం దృష్టికి తీసుకు వచ్చారు అధికారులు. వారిని హోమ్‌ క్వారంటైన్‌లో పెడితే సరిపోతుందన్నారు. గుజరాత్‌ నుంచి వచ్చేవారికి పరీక్షల ఫలితాల ఆధారంగా ఇళ్లకు పంపిస్తామని చెప్పారు అధికారులు. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు 235 క్లస్టర్లు ఉన్నాయని, అందులో 79 వెరీ యాక్టివ్‌ క్లస్టర్స్, 68 యాక్టివ్‌ క్లస్టర్స్‌ ఉన్నాయన్నారు. 53 డార్మంట్‌ క్లస్లర్స్‌ ఉన్నాయని వివరించారు. 35 క్లస్టర్లలో 28 రోజుల నుంచి కేసులు లేవని చెప్పారు.

కాగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 60 కరోనా కేసులతో ఇప్పటివరకూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,463కు చేరాయి పాజిటివ్ కేసుల సంఖ్య. అలాగే 33 మంది కరోనా వైరస్‌తో మరణించారు. ఇక 403 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవ్వగా.. ప్రస్తుతం 1027 యాక్టీవ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇక జిల్లాల వారిగా క‌రోనా కేసుల సంఖ్య ఈ విధంగా ఉంది. కర్నూలు జిల్లా – 411 గుంటూరు జిల్లా – 306 కృష్ణా జిల్లా – 246 నెల్లూరు జిల్లా -84 చిత్తూరు జిల్లా – 80 కడప జిల్లా -79 అనంతపురం జిల్లా -67 ప్రకాశం జిల్లా – 60 పశ్చిమ గోదావరి జిల్లా – 58 తూర్పుగోదావరి జిల్లా – 42 విశాఖపట్నం జిల్లా -25 శ్రీకాకుళం జిల్లా – 5

ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
ఆ స్టార్ హీరో సినిమాపై అక్కినేని కోడలి ప్రశంసల జల్లు
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
మేకింగ్‌తో రాజమౌళినే ఫిదా చేసిన సినిమా ఏదో తెలుసా?
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
శీతాకాలంలో ఈ కూరగాయను పండించండి.. తక్కువ ఖర్చుతో రెట్టింపు ఆదాయం!
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
మరో ప్లేయర్‌పైనా గంభీర్ పగ పట్టాడా.. వైట్ బాల్ కెరీర్ క్లోజ్?
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
అయ్యో.. పుట్టింట్లో భార్య.. లాడ్జిలో భర్త.. ఆత్మహత్యల వెనక అసలు..
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మందారం నీరు తాగడం వల్ల మీ ఆరోగ్యానికి ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
మీ వాష్ బేసిన్ ట్యాప్‌పై మొండి మరకలు పోవాలా? అద్భుతమైన ట్రిక్స్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
బాగా చదువుకోవాలని తండ్రి మందలింపు.. పదో తరగతి విద్యార్ధి సూసైడ్‌!
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..
హైదరాబాద్ టూ విజయవాడ.. ఇకపై ప్రయాణం మూడు గంటలే.! రయ్.. రయ్‌మంటూ..
ప్రపంచ వేదికపై భారత యువ సంచలనాల జైత్రయాత్ర..!
ప్రపంచ వేదికపై భారత యువ సంచలనాల జైత్రయాత్ర..!