మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు

ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మధ్య ప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఆ రాష్ట్ర యువతకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని మంగళవారం తెలియజేశారు. కోవిడ్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో..

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం.. వారికి మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు
Follow us

| Edited By:

Updated on: Aug 18, 2020 | 1:38 PM

ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మధ్య ప్రదేశ్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం ఆ రాష్ట్ర యువతకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించింది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయాన్ని మంగళవారం తెలియజేశారు. కోవిడ్ మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో రాష్ట్ర యువతను ఆదుకుని వారికి ఉద్యోగాలు కల్పించేందుకు మధ్య ప్రదేశ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం అవసరమైన చట్టపరమైన చర్యలు చేపడతామని శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు. కాగా ఏపీ, హర్యానా సహా పలు రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. గవర్నమెంట్ ఉద్యోగాలను ఆ రాష్ట్రానికి చెందిన స్థానికులకే ఇచ్చేందుకు బిల్లులను కూడా ప్రవేశ పెట్టాయి. ప్రైవేటు ఉద్యోగాలను కూడా రాష్ట్రంలోని వారికే కేటాయించాలని కొన్ని రాష్ట్రాలు పేర్కొంటున్నారు.

Read More:

ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిని హడలెత్తిస్తున్న కరోనా

హైదరాబాద్ టూ యూకే విమాన సర్వీసులు స్టార్ట్

బ్రేకింగ్: ఢిల్లీ ఎయిమ్స్‌లో అమిత్ షా అడ్మిట్