కరోనా..కరోనా.. ఇప్పుడు చైనా చేస్తోందేమిటి ?

కరోనా వైరస్ ప్రబలడానికి కారణం చైనాయేనని అన్ని దేశాలూ వేలెత్తి చూపిస్తున్న వేళ.. ఆ దేశం మరో కొత్త 'ప్రయోగం' చేపడుతోంది. గబ్బిలాలు, పాంగోలిన్ల వ్యర్థాల నుంచి తయారు చేసే సాంప్రదాయక మెడిసిన్లకు..

కరోనా..కరోనా.. ఇప్పుడు చైనా చేస్తోందేమిటి ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 09, 2020 | 6:58 PM

కరోనా వైరస్ ప్రబలడానికి కారణం చైనాయేనని అన్ని దేశాలూ వేలెత్తి చూపిస్తున్న వేళ.. ఆ దేశం మరో కొత్త ‘ప్రయోగం’ చేపడుతోంది. గబ్బిలాలు, పాంగోలిన్ల వ్యర్థాల నుంచి తయారు చేసే సాంప్రదాయక మెడిసిన్లకు, ఉత్పత్తులకు స్వస్తి చెబుతోంది. తమ మందుల కోసం వీటిని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నామన్న అప్రదిష్టను తొలగించుకోవడానికి ఈ సరికొత్త యోచనకు శ్రీకారం చుట్టింది. చైనా ప్రభుత్వం తమ ‘డ్రగ్ బైబిల్’ నుంచి ఈ మందులను తొలగిస్తున్నామని ప్రకటించుకుంటోంది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి పుట్టిందని, పాంగోలిన్ల ద్వారా మానవులకు సంక్రమిస్తోందని నిపుణులు అనుమానిస్తుండగా.. ఆ దేశం మెల్లగా ఈ గైడ్ నుంచి వీటిని తొలగిస్తున్నట్టు పేర్కొంది. గబ్బిలాల వ్యర్థాల నుంచి తయారు చేసే మందులు వివిధ రకాల కంటి రోగాలను నయం చేస్తాయట.. అలాగే పాంగోలిన్ల చర్మ పొలుసుల నుంచి తయారు చేసే ‘జియా జూ ‘ అనే మెడిసిన్ బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచుతుందని, కడుపులో మంట వంటి రుగ్మతలను నయం చేస్తుందని వారు నమ్ముతున్నారు. 16 వ శతాబ్దంలోనే చైనా మెడికల్ ఎన్ సైక్లోపీడియాలో ఈ మందుల గురించి వివరించారని చెబుతారు. తాజాగా పాంగోలిన్ల రవాణాను,  వాటి మాంసం తినడాన్ని తాత్కాలికంగా  నిషేధించినట్టు చైనా ప్రకటించింది. అంతరించిపోతున్న పాంగోలిన్లను ఇక పరిరక్షిస్తామని బీజింగ్ వెల్లడించింది. అయితే వూహాన్ మార్కెట్ లో మాత్రం వన్య మృగాల అవశేషాలు కనబడుతూనే ఉన్నాయి.