కరోనా విజృంభణ: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. శుక్రవారం దాదాపు 50వేల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. మరో 775 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో..

కరోనా విజృంభణ: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
Follow us

|

Updated on: Jul 25, 2020 | 5:26 PM

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి ఉగ్రరూపం ప్రదర్శిస్తోంది. శుక్రవారం దాదాపు 50వేల మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. మరో 775 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13.37 లక్షలకు చేరుకోగా.. మరణాల సంఖ్య 31,406కి చేరింది. ఇప్పటి వరకూ 8.50 లక్షల మంది బాధితులు కోలుకోగా.. మరో 4.50 లక్షల మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా విలయతాండవం చేస్తోంది.

తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. వైరస్ తీవ్రత రోజురోజుకి పెరిగిపోతున్న క్రమంలో కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కరోనా టెస్టుల సంఖ్యను గణనీయంగా పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సూచించింది. కంటైన్మెంట్ జోన్లపై మరింత శ్రద్ధ పెట్టాలని కేంద్రం తెలిపింది. కరోనా పరీక్షలను పెంచి పాజిటివిటీ రేటు తగ్గిస్తామని ప్రకటించిన కేంద్రం అందుకనుగుణంగా టెస్టుల సంఖ్యను పెంచుతోంది. దేశవ్యాప్తంగా 1290 ల్యాబ్‌లలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.

దేశ వ్యాప్తంగా చూసుకుంటే, మహారాష్ట్ర ఎప్పటిలాగా 9,615 కేసులతో తొలిస్థానంలో నిలవగా.. ఆంధ్రప్రదేశ్ 8,147 కేసులతో రెండో స్థానంలో ఉంది. గడచిన వారం రోజులుగా మహారాష్ట్ర తర్వాత ఏపీలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు నమోదువుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం మొత్తం 1640 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 52,466కు చేరింది.