కరోనా ఎఫెక్ట్ : సింహగిరిప్రదక్షిణ రద్దు

పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం ఉత్సవాలకు కరోనా ఎఫెక్ట్‌ పడింది. ప్రతిఏటా అత్యంత వైభవంగా నిర్వహించే గిరిప్రదక్షిణకు ఈ సారి బ్రేక్‌ పడింది....

కరోనా ఎఫెక్ట్  : సింహగిరిప్రదక్షిణ రద్దు
Follow us

|

Updated on: Jul 04, 2020 | 10:56 AM

Cancellation of Giridachi due to Corona : పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలం ఉత్సవాలకు కరోనా ఎఫెక్ట్‌ పడింది. ప్రతిఏటా అత్యంత వైభవంగా నిర్వహించే గిరిప్రదక్షిణకు ఈ సారి బ్రేక్‌ పడింది. విశాఖలో విజృభిస్తున్న కరోనా నేపథ్యంలో ఈ రోజు జరగవల్సిన గిరిప్రదక్షిణను రద్దు చేశారు అధికారులు.. దీంతో పాటు 5న సింహాచలంలో ఆషాడపౌర్ణమి సందర్భంగా జరిగే తుదివిడత చందనసమర్పణను కూడా అధికారులు రద్దు చేశారు. అప్పన్న భక్తులు పరమపవిత్రంగా భావించే సింహాచలం గిరిప్రదక్షిణకు తెలుగు రాష్ట్రా ల నుంచే కాక వివిధరాష్ట్రాల నుంచి భక్తులు ఈ ప్రదక్షిణలో పాల్గొంటారు. ఉదయం నుంచి ప్రారంభమయ్యే గిరిప్రదక్షిణ రాతంత్రా కొనసాగి మరుసటి రోజు ఉదయం అప్పన్న దర్శనంతో ముగుస్తుంది.

సింహాచలంలో ప్రతిఏటా ఆషాడపౌర్ణమికి ముందు రోజు జరిగే గిరి ప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.గిరి ప్రదక్షిణకు చేస్తే భూమి ప్రదక్షిణ చేసినంత పుణ్యఫలమోస్తోందని భక్తుల విశ్యాసం..దీనికి తోడు మూలికలు, సుగంధ ద్రవ్యాలు వనాలతో మిళితమైన సింహగిరి కొండచుట్టూ తిరిగితే..ఆ గిరినుంచి వచ్చే గాలిని పీలిస్తే ఆయురోరాగ్యాలతో ఉంటామని భక్తుల నమ్మకం.

అయితే నిత్యం జరిగే పూజలు దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని అంటున్నారు అధికారులు. భక్తుల ఆరోగ్యం దృష్ట్య దేవాదవశాఖ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకునట్లు వెల్లడించారు. అయితే..ఎంతో విశ్వాసంతో పవిత్రంగా భావించే గిరిప్రదిక్షిణను రద్దు చేయడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు. ఏడాదికోసారి సింహగిరి చుట్టూ 32 కిలోమీటర్లు నడొచేందుకు ఉత్సాహంగా పాల్గొనే భక్తులు ఈ సారి ఆ అవకాశం లేకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..