British studies warn: ఏప్రిల్‌ నాటికి 75 వేల మరణాలు.. ముప్పు మరింత పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న సైంటిస్టులు..

|

Dec 13, 2021 | 8:53 PM

ఒమిక్రాన్‌ గురించి అన్ని దేశాలు భయపడ్డాయి. దీని ప్రభావం మామూలుగా ఉండదని వార్నింగ్‌ ఇచ్చారు సైంటిస్టులు. లేటెస్ట్‌ అప్‌డేట్‌తో ఆ భయం మరింత పెరిగింది. సౌతాఫ్రికాలో

British studies warn: ఏప్రిల్‌ నాటికి 75 వేల మరణాలు.. ముప్పు మరింత పెరిగే ఛాన్స్‌ ఉందంటున్న సైంటిస్టులు..
Omicron Variant
Follow us on

ఒమిక్రాన్‌ గురించి అన్ని దేశాలు భయపడ్డాయి. దీని ప్రభావం మామూలుగా ఉండదని వార్నింగ్‌ ఇచ్చారు సైంటిస్టులు. లేటెస్ట్‌ అప్‌డేట్‌తో ఆ భయం మరింత పెరిగింది. సౌతాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ అన్ని దేశాలను వణికిస్తోంది. కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్న తరుణంలో కొత్తవేరియంట్‌ పుట్టుకురావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. తాజాగా యూకేలో తొలి ఒమిక్రాన్‌ మరణం నమోదైంది. ఒమిక్రాన్‌ తొలి మరణం నమోదైనట్లు ధృవీకరించారు యూకే పీఎం బోరిస్‌ జాన్సన్‌. నవంబర్‌ 27న యూకేలో ఒమిక్రాన్‌ కేసులు నమోదైనప్పటి నుంచి, కఠినమైన ఆంక్షలు విధించారు అధికారులు. అయినా, ఒమిక్రాన్‌ కేసుల్లో యూకే మొదటి స్థానంలో ఉంది.

దీంతో ఒమిక్రాన్‌ ఎమర్జెన్సీ విధించారక్కడ. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ వేరియంట్‌ వ్యాప్తి బ్రిటన్‌లోనే ఎక్కువగా ఉన్నట్లు లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌, ట్రాపికల్‌ మెడిసిన్‌ వెల్లడించింది. ముందస్తుగా చర్యలు తీసుకోకపోతే మరింత ముప్పు ఉండే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.

ఈ వేరియంట్‌ వల్ల యూకేలో భారీ ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి 25వేల నుంచి 75వేల మరణాలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌. ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య 60 శాతం పెరగనున్నట్లు తెలిపింది.

ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. రోజుకు వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రాబోయే రెండు వారాల్లో మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: CM KCR: శ్రీరంగంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు.. మంగళవారం తమిళనాడు సీఎంతో ప్రత్యేక సమావేశం..

SMART Success: భారత అమ్ములపొదిలో మరో అద్భుత అస్త్రం.. స్మార్ట్ ప్రయోగం విజయవంతం