అటు కరోనా కేసుల ఉధృతి.. ఇటు పెరుగుతున్న రీకవరీ రేటు
దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా మరోవైపు రీకవరీ రేటు కూడా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 1752 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం ఈ సంఖ్య 23,452 కి చేరింది. మృతుల సంఖ్య 723 కి పెరిగింది. గత 24 గంటల్లో 37 మంది మరణించారు. ఇప్పటివరకు 4,748 మంది కోలుకున్నారని, దీనితో రీకవరీ రేటు 20.57 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖవర్గాలు తెలిపాయి. అటు కేసుల డబ్లింగ్ రేటు కూడా 7.5 రోజుల […]
దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నా మరోవైపు రీకవరీ రేటు కూడా పెరుగుతోంది. శుక్రవారం ఒక్కరోజే 1752 కొత్త కేసులు నమోదు కాగా.. మొత్తం ఈ సంఖ్య 23,452 కి చేరింది. మృతుల సంఖ్య 723 కి పెరిగింది. గత 24 గంటల్లో 37 మంది మరణించారు. ఇప్పటివరకు 4,748 మంది కోలుకున్నారని, దీనితో రీకవరీ రేటు 20.57 శాతానికి పెరిగిందని ఆరోగ్య శాఖవర్గాలు తెలిపాయి. అటు కేసుల డబ్లింగ్ రేటు కూడా 7.5 రోజుల నుంచి 10 రోజులకు పెరగగా.. 14 రోజుల్లో 80జిల్లాల్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదని ఈ వర్గాలు పేర్కొన్నాయి. లాక్ డౌన్ మంచి ఫలితాల నిస్తున్నట్టు వివరించాయి.