విషాదం.. 12 మంది గ్యాస్ బాధితుల్ని కాటేసిన కరోనా..

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయనుకుంటే.. తాజాగా.. మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. భోపాల్ విష వాయువు ఘటన బాధితులు 12 మందిని.. కరోనా మహమ్మారి కాటేసింది. వీరంతా కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు. భోపాల్ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు విడుదలైన సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ దుర్ఘటనలో నుంచి కొందరు ప్రాణాలతో […]

విషాదం.. 12 మంది గ్యాస్ బాధితుల్ని కాటేసిన కరోనా..

Edited By:

Updated on: Apr 30, 2020 | 4:23 PM

కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయనుకుంటే.. తాజాగా.. మరణాల సంఖ్య కూడా క్రమక్రమంగా పెరుగుతోంది. తాజాగా మధ్యప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విళయ తాండవం చేస్తోంది. భోపాల్ విష వాయువు ఘటన బాధితులు 12 మందిని.. కరోనా మహమ్మారి కాటేసింది. వీరంతా కరోనా బారినపడి ప్రాణాలు విడిచారు.

భోపాల్ నగరంలోని ఓ ఫ్యాక్టరీ నుంచి విషవాయువులు విడుదలైన సమయంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ దుర్ఘటనలో నుంచి కొందరు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే అప్పుడు ప్రాణాలతో బయటపడ్డ వారిని ఇప్పుడు కరోనా వైరస్ బలితీసుకుంది. మొత్తం పన్నెండు మంది గ్యాస్‌ బాధితులు కరోనాతో మరణించినట్లు అధికారులు తెలిపారు. నగరంలోని హమీదియా గవర్నమెంట్ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయిన రోగులను పరీక్షించగా వారంతా కరోనా ప్రభావంతోనే మరణించినట్లు తేలింది. అయితే ఇలా ఒక్కక్కరుగా మొత్తం పన్నెండు మంది ప్రాణాలు కోల్పోవడంతో.. ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. గ్యాస్ బాధితులు ఉంటున్న ప్రాంతాల్లో కరోనా వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.