AP Corona Cases: ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. ఏకంగా 758 కేసులు.. పెరిగిన మరణాల సంఖ్య

|

Mar 25, 2021 | 4:28 PM

ఆంధ్రప్రదేశ్ కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ప్రమాదకర రీతిలో కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.  రాష్ట్రంలో కొత్తగా 758 కరోనా కేసులు నమోదయ్యాయి

AP Corona Cases: ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. ఏకంగా 758 కేసులు.. పెరిగిన మరణాల సంఖ్య
AP-Corona
Follow us on

Andhra Corona Cases: ఆంధ్రప్రదేశ్ కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. ప్రమాదకర రీతిలో కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.  రాష్ట్రంలో కొత్తగా 758 కరోనా కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 895879కి చేరింది. మరో నలుగురు కరోనా కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7201కి చేరింది. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 231 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా  ప్రస్తుతం 3,469 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.  రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 35,196 కరోనా పరీక్షలు వైద్యారోగ్య శాఖ గురువారం విడుదల చేసిన బులిటెన్‌లో తెలిపింది. నేటి వరకు రాష్ట్రంలో 1,48,75,597 శాంపిల్స్ టెస్ట్ చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

కరోనా కేసుల ఉధృతి పెరిగిన నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, భౌతికదూరం పాటించడం తప్పనిసరి అని చెబుతున్నారు. వైరస్‌ను లైట్ తీసుకోవద్దని, అది మరోసారి విజృంభిస్తే ప్రమాదకర పరిస్థితులు తప్పవని హెచ్చరిస్తున్నారు.

దేశవ్యాప్తంగా కూడా పెరిగిన కేసులు…

దేశవ్యాప్తంగా కూడా కరోనా మహమ్మారి కొరలు చాస్తోంది. గతంలో తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు నిత్యం వేలల్లో పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. బుధవారం కరోనా కేసుల సంఖ్య అరలక్ష మార్క్ దాటింది. ఐదు నెలల అనంతరం గరిష్ట స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 53,476 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 251 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ గురువారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 1,17,87,534 కరోనా కేసులు నమోదు కాగా.. 1,60,692 మంది ఈ మహమ్మారి కారణంగా మరణించారు.

 

Also Read:  ఏపీ సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్ చిరంజీవి.. పూర్తి వివరాలు

సీఎం జగన్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకూ ఆర్థిక సాయం.. ఏప్రిల్ 6న నిధుల విడుదల