లాక్‌డౌన్ వేళ ఆనంద్ మహీంద్ర ఆసక్తికర ట్వీట్…అదివారి గొప్పతనం !
కరోనా నేపథ్యంలో తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడు పలు ఆసక్తికర విషయాలు పోస్ట్ చేస్తుంటారు. అతడు పోస్ట్ చేసే ప్రతి పోస్ట్ అందరిని ఆలోచింపచేసేలా ఉండటం గమనార్హం. తాజాగా ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.
ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఆనంద్ మహీంద్రా కూడా లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ ఇంట్లోనే ఉంటున్నారు. ఇంట్లో ఉంటూ ..వాట్సాప్ వండర్ బాక్స్ విశేషాలను పంచుకుంటూ తన అనుచరులను బాగా ఎంటర్ టైన్ చేస్తున్నారు. పలు రకాలైన వీడియోలు చమత్కారాలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. ఈ మద్యే లుంగీ గురించి ప్రస్తావించి అందరిని నవ్వుల్లో ముంచేసిన ఆనంద్ మహీంద్ర తాజాగా మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
వాట్సాప్ వండర్ బాక్స్ లో తనను ఆకట్టుకున్న ఇన్ స్టంట్ సూట్ గురించి ప్రస్తావించారు. కరోనా వైరస్ కాలంలో ఇన్ స్టంట్ సూట్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ కు త్వరగా ఎలా హాజరుకావచ్చో వివరించే వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ లో పంచుకున్నారు. ప్రత్యేకంగా రూపొందించిన సూట్ కింద ధరించేందుకు ఈ పెద్దమనిషికి తాను ఒక లుంగీని కూడా పంపించాలనుకుంటున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. ఈ లాక్ డౌన్ మనకు చాలా విషయాలను నేర్పిందన్నారు. మగవాళ్లకు సంబంధించి హెయిర్ కటింగ్ కష్టాలపై కూడా ఆయన తన ట్వీట్ ద్వారా వెల్లడించారు. బార్బర్ గొప్పతనాన్ని ప్రశంసించారు. ఇప్పుడు ఆనంద్ మహీంద్రా చేసిన ట్వీట్ నెటిజన్లు ఎప్పటిలాగే కామెంట్ల వర్షం కురుపిస్తున్నారు.
