షాకింగ్‌.. మసీదుల్లో విదేశీయుల్ని దాచిన ప్రొఫెసర్‌.. ఒక్కర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా..

ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తబ్లీఘీ సమావేశాలకు హాజరైన విదేశీయులను వెతికే పనిలో ఉంటే.. కొందరు మాత్రం వారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా యూపీలోని  ప్రయాగ్‌రాజ్‌లో ఓ ప్రొఫెసర్‌ నిర్వాకం బయటపడింది. తబ్లీఘీ జమాతేకు చెందిన విదేశీయులను స్థానికంగా ఉన్న రెండు మసీదుల్లో దాచిపెట్టాడు. సదరు ప్రొఫెసర్‌ అలహాబాద్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహ్మద్ షాహిద్‌గా గుర్తించారు. తబ్లీఘీ జమాత్‌కు చెందిన ఇండోనేషియా, థాయ్‌లాండ్‌కు చెందిన వారిని ప్రయాగ రాజ్‌లోని మసీదుల్లో సదరు ప్రొఫెసర్‌ […]

షాకింగ్‌.. మసీదుల్లో విదేశీయుల్ని దాచిన ప్రొఫెసర్‌.. ఒక్కర్ని కాదు.. ఇద్దర్ని కాదు.. ఏకంగా..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 21, 2020 | 4:41 PM

ఓ వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తబ్లీఘీ సమావేశాలకు హాజరైన విదేశీయులను వెతికే పనిలో ఉంటే.. కొందరు మాత్రం వారిని దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా యూపీలోని  ప్రయాగ్‌రాజ్‌లో ఓ ప్రొఫెసర్‌ నిర్వాకం బయటపడింది. తబ్లీఘీ జమాతేకు చెందిన విదేశీయులను స్థానికంగా ఉన్న రెండు మసీదుల్లో దాచిపెట్టాడు. సదరు ప్రొఫెసర్‌ అలహాబాద్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మహ్మద్ షాహిద్‌గా గుర్తించారు.

తబ్లీఘీ జమాత్‌కు చెందిన ఇండోనేషియా, థాయ్‌లాండ్‌కు చెందిన వారిని ప్రయాగ రాజ్‌లోని మసీదుల్లో సదరు ప్రొఫెసర్‌ దాచిపెట్టాడన్న పక్కా సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. దీంతో మసీదుల్లో నక్కిఉన్నఇండోనేషియాకు చెందిన ఏడుగుర్ని, థాయిలాండ్‌కు చెందిన తొమ్మిది మందితో పాటు ప్రొఫెసర్‌ను కూడా అరెస్ట్ చేశారు. అంతేకాదు వీరికి సహకరించిన మరో 12 మందిని కూడా అరెస్ట్ చేశారు. మొత్తం ప్రొఫెసర్ మహ్మద్ షాహిద్‌తో కలిపి 30 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే తబ్లీఘీ జమాత్‌ సభ్యులను దాచిపెట్టడానికి అసలు కారణాలేంటన్న దానిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని మసీదుల్లో కూడా తబ్లీఘీ జమాత్‌ సభ్యులు దాక్కుని ఉండే అవకాశం ఉందనే కోణంలో కూడా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.

కాగా.. గత మార్చి నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్‌లో తబ్లీఘీల సదస్సు జరిగింది. ఈ సమావేశానికి వేలమంది విదేశీయులు కూడా హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. ఆదేశాలను దిక్కరిస్తూ.. బేఖాతరు చేస్తూ..మర్కజ్‌ భవనంలోనే ఉండిపోయారు. మరికొందరు దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. అయితే వీరిలో కొందర్ని మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. ఎంతో మంది జాడ ఇంకా తెలియడం లేదన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇటీవల ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ నేత కూడా తబ్లీఘీల జాడ దొరకడం లేదంటూ ఓ ట్వీట్‌ కూడా చేశారు. ఆరు వేల మంది ఫోన్లు స్విచ్చ్‌ ఆఫ్ ఉన్నాయంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

అయితే తబ్లీఘీల వ్యవహారంపై యూపీ సర్కార్ మండిపడుతోంది. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా.. కొందరు తబ్లీఘీలు దాక్కోవడాన్ని సీరియస్‌గా తీసుకుంటుంది. దేశంలో ఓ పక్క కరోనా కట్టడి కోసం ప్రజలంతా లాక్‌డౌన్‌ పాటిస్తుంటే.. తబ్లీఘీ జమాత్ సభ్యులను అది కూడా విదేశీయులను కొందరు దాచి ఉంచడంలో కుట్ర దాగి ఉందని యోగి సర్కారు  అనుమానిస్తోంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!