AIIMS SHOCKING NEWS: కరోనా ‘డెల్టా’ వేరియంట్‌పై ఏయిమ్స్ సంచలన ప్రకటన.. వ్యాక్సిన్ వేసుకున్నోళ్ళకూ థ్రెట్టే..!
కరోనా డెల్టా వేరియంట్‌పై ఢిల్లీ ఏయిమ్స్ వైద్యబృందం షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కరోనా డెల్టా వేరియంట్ అతి ప్రమాదకరమైనదని ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న...
AIIMS SHOCKING NEWS ABOUT CORONA DELTA VARIANT: కరోనా డెల్టా వేరియంట్‌పై ఢిల్లీ ఏయిమ్స్ వైద్యబృందం షాకింగ్ న్యూస్ వెల్లడించింది. కరోనా డెల్టా వేరియంట్ అతి ప్రమాదకరమైనదని ప్రకటించింది. వ్యాక్సిన్ వేసుకున్న వారిపైనా దీని ప్రభావం దారుణంగా వుంటుందని ఏయిమ్స్ వైద్యులు తాజాగా వెల్లడించారు. ఏయిమ్స్ వైద్య బృందం, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయం తేలినట్లు ఏయిమ్స్ జూన్ పదిన ప్రకటించింది. కోవీషీల్డ్, కోవాక్జిన్ ఒకటి లేదా రెండో డోసులు వేసుకున్న వారిపైనా డెల్టా వేరియంట్ కరోనా వైరస్ ప్రభావం చూపుతుందని, వ్యాక్సిన్ల వల్ల వారిలో ఉత్పత్తి అయిన యాంటీబాడీస్ నుంచి డెల్టా వేరియంట్ వైరస్ తప్పించుకోగలుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. యాంటీబాడీస్ నుంచి తప్పించుకున్న డెల్టా వేరియంట్ వైరస్.. శరీరంలోని భాగాలకు విస్తరించి.. ప్రాణాలను హరిస్తుందని వెల్లడైంది తాజా అధ్యయనంలో.
డెల్టా వేరియంట్ అని నామకరణం చేయక ముందు ఈ వేరియంట్‌ను దాని శాస్త్రీయ నామం.. బీ.1.617.2 గా పిలిచే వారు. ఒరిజినల్ కరోనా వైరస్ రెండు సార్లు మ్యూటెంట్ అయిన తర్వాత ఆవిర్భవించిందే ఈ బీ.1.617.2 వేరియంట్ కరోనా వైరస్. దానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డెల్టాగా నామకరణం చేసింది. ఈ వేరియంట్ మన దేశంలో తొలిసారిగా మహారాష్ట్రలో 2020 అక్టోబర్ నెలలో కనుగొన్నారు. E484Q, L452R అనే రెండు రకాల మ్యూటెంట్ అయిన కరోనా వైరస్‌ల సంయోగంతో ఉత్పన్నమైన డెల్టా వేరియంట్ కరోనా వైరస్… చాలా సులభంగా మనిషి శరీరంలోని ఇమ్యూన్ సిస్టమ్‌ని బ్రేక్ చేయగలుగుతుందని శాస్త్రవేత్తలు ఇదివరకే వెల్లడించారు. ఈ వేరియంట్ హైలీ ఇన్ఫెక్షియస్ అని, ట్రాన్స్‌మిస్సబుల్ అని ఇటీవల యుకే శాస్త్రవేత్తలు కూడా ప్రకటించారు. దీనిని వేరియంట్ ఆఫ్ కన్సెర్న్‌గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గత నెలలో డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.