అహోబిలం పూజారికి కరోనా పాజిటివ్..దర్శనాలకు బ్రేక్
ఈ నెల 18న ఆలయం పూజారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా పూజారికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ అర్చకుడిని క్వారంటైన్‌కు...

కరోనా మహమ్మారి అన్ని వర్గాల ప్రజలను అతలాకుతలం చేస్తోంది. తాజాగా అహోబిలం లక్ష్మినరసింహస్వామి ఆలయంలో పూజారికి కరోనా వైరస్ సోకిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 18న ఆలయం పూజారులు, సిబ్బందికి పరీక్షలు నిర్వహించగా పూజారికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
దీంతో ఆ అర్చకుడిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే దేవాదాయ శాఖ అదేశాల మేరకు ఆలయాన్ని ఈ నెల 30 వరకు మూసివేయాలని చెప్పడంతో గుడిని మూసివేసినట్లు ఆలయ ఈవో ప్రకటించారు. తిరిగి జులై 1న ఆలయంలో భక్తులకు దర్శనం ఉంటుందని ప్రకటించారు. భక్తులు తమ అహోబిలం యాత్రను వాయిదా వేసుకోవాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే అక్కడున్న షాపులను కూడా మూసివేశారు.




