అసభ్యంగా ప్రవర్తించాడని.. కొడుకుపైనే కేసు పెట్టిన నటి

ఓ ట్రాన్స్‌ జెండర్‌తో తప్పుగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో.. కొడుకుపైనే పోలీసు కేసు పెట్టింది మలయాళ నటి. తప్పు చేస్తే కొడుకైనా.. ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఈమె అంటున్నారు. ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్‌తో.. తన కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో వాళ్ల అమ్మ పార్వతి కూడా ట్రాన్స్‌జెండర్‌కే...

  • Tv9 Telugu
  • Publish Date - 9:27 pm, Sat, 13 June 20
అసభ్యంగా ప్రవర్తించాడని.. కొడుకుపైనే కేసు పెట్టిన నటి

ఓ ట్రాన్స్‌ జెండర్‌తో తప్పుగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో.. కొడుకుపైనే పోలీసు కేసు పెట్టింది మలయాళ నటి. తప్పు చేస్తే కొడుకైనా.. ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని ఈమె అంటున్నారు. ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్‌తో.. తన కొడుకు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వచ్చాయి. ఇందులో వాళ్ల అమ్మ పార్వతి కూడా ట్రాన్స్‌జెండర్‌కే అండగా నిలవడం గమనార్హం.

వివరాల్లోకి వెళ్తే.. మలయాళ ఇండస్ట్రీకి చెందిన మాల పార్వతికి అక్కడ మంచి నటిగా పేరుంది. అయితే ఈ మధ్య ఆమె కొడుకు అనంత్ కృష్ణన్‌పై కొన్ని ఆరోపణలు వచ్చాయి. దానిపై తాజాగా ఆవిడ స్పందించారు. గత కొంత కాలంగా ట్రాన్స్ జెండర్ మేకప్ ఆర్టిస్ట్‌తో.. తన కుమారుడు కృష్ణన్ తప్పుగా ప్రవర్తించాడని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆమె తెలిపారు.

అలాగే మేకప్ ఆర్టిస్ట్ సీమా వినీత్ తనకు ఎన్నో సంవత్సరాలుగా తెలుసన్నారు. అలాగని నా కొడుకుని తప్పుబడటం లేదు. నిజానిజాలేంటో ఇంకా బయటకి రావాల్సి ఉంది. అవి వచ్చిన తరువాత ఎవరేంటి అనేది తెలుస్తుందని చెప్పారు. కానీ ప్రస్తుతానికి తన సపోర్ట్ మాత్రం సీమకే ఉందని చెప్పి సంచలన రేపారు నటి మాలా పార్వతి. ఒకవేళ తన కొడుకు నిజంగానే తప్పు చేస్తే మాత్రం శిక్ష అనుభవించక తప్పదని ఆమె పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఈ న్యూస్ పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.

Asianet-Breaking News |Kerala Local News |Kerala Latest News ...

Read More: 

భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీకాళహస్తిలో దర్శనాలకు గ్రీన్ సిగ్నల్..

యాంకర్ సుమ అరుదైన ఫొటో.. చూస్తే అవాక్కవ్వాల్సిందే..

బ్రేకింగ్: మాజీ ప్రధాన మంత్రికి కరోనా పాజిటివ్..

అనారోగ్యంతో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మృతి