హైదరాబాద్‌లో కరోనా ఆస్పత్రులు, నిర్ధారణ కేంద్రాల పెంపు
దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. దేశంలో రోజుకు 10వేలకు పైగా పాజిటివ్ కేసులతో భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడుతోంది. దేశంలోనే అత్యధిక కేసులతో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లు ముందు వరుసలో కొనసాగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పంజా విసురుతోంది.

దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. దేశంలో రోజుకు 10వేలకు పైగా పాజిటివ్ కేసులతో భారత్ ప్రపంచ దేశాలతో పోటీపడుతోంది. దేశంలోనే అత్యధిక కేసులతో మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లు ముందు వరుసలో కొనసాగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్ పంజా విసురుతోంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రోజురోజుకు కేసులు పెరగడం, మృతుల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో కేసులు క్రమంగా పెరుగుతున్నందున ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 5 కరోనా ఆసుపత్రులను ఏర్పాటు చేసింది. అలాగే మరో 6 వైరస్ నిర్దాణ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. అలాగే 5వేల వెంటిలేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. మరో 25 వేల వరకు పడకలను సిద్ధం చేశామని చెప్పారు. ఇప్పటి వరకు కరోనాకు ప్రత్యేకించి ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే చికిత్సలు నిర్వహిస్తుండగా, ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో బాధితులకు మరిన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి.
కరోనా ఆసుపత్రుల వివరాలుః
– గాంధీ ఆసుపత్రి (కోవిడ్ నోడల్ కేంద్రం) ఇక్కడ 2వేల పడకల సామర్థ్యం ఉంది.
– కొండాపూర్, రంగారెడ్డి జిల్లా ఆసుపత్రులు (20 పడకల సామర్థ్యం ఉంది)
– కింగ్ కోఠి, హైదరాబాద్ జిల్లా ఆసుపత్రి
– ఎర్రగడ ఛాతీ ఆసుపత్రి
– పంజగుట్ట నిమ్స్ ఆసుపత్రి
కరోనా పరీక్ష నిర్దారణ కేంద్రాల వివరాలుః
– గాంధీ మెడికల్ కాలేజీ
– ఉస్మానియా మెడికల్ కాలేజీ
– పంజగుట్ట నిమ్స్
– సీసీఎంబీ
– నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి




