యువర్ అటెన్షన్ ప్లీజ్!
ప్రయాణికలు కోవిడ్-19 బారినపడుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. కోవిడ్-19 లక్షణాలను గుర్తించేందుకు ముంబై రైల్వే స్టేషన్లలో అత్యాధునిక కోవిడ్-19 స్క్రీనింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది.

ప్రయాణికలు కోవిడ్-19 బారినపడుతున్న నేపథ్యంలో రైల్వేశాఖ మరింత జాగ్రత్తలు తీసుకుంటోంది. కోవిడ్-19 లక్షణాలను గుర్తించేందుకు ముంబై రైల్వే స్టేషన్లలో అత్యాధునిక కోవిడ్-19 స్క్రీనింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ టెర్మినస్, లోకమాన్య తిలక్ టెర్మినస్ రైల్వే స్టేషన్లలో ‘ఫెబ్రిఐ థర్మల్ కెమెరా’లను ఏర్పాటు చేసింది. ఆయా రైల్వే స్టేషన్ లకు రాకపోకలు సాగించే ప్రయాణిలు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాల్సి వుంటుంది. కరోనా లక్షణాలు లేనివారిని మాత్రమే ప్రయాణానికి అనుమతిస్తారు.ఫెబ్రిఐ అనేది కృత్రిమ మేధాశక్తి ఆధారిత థర్మల్ స్క్రీనింగ్ సిస్టమ్. ప్రయాణికులను ప్రత్యక్షంగా, ఆటోమేటిక్‌గా స్క్రీనింగ్ చేసే అవకాశం వుంటుంది. దీనిలోని హీట్ సెన్సర్లు వ్యక్తి విడుదల చేసే వేడిని రికార్డు చేస్తాయి. నిర్ణీత ఉష్ణోగ్రత కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు కలిగిన వ్యక్తి ఈ పరికరంలోని కెమెరా ముందుకు వెళ్తే, దీనికి అమర్చిన కంప్యూటర్‌లో రంగు మారుతుంది.



