కరోనా ఎఫెక్ట్.. ఏపీ సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు..!

కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా ఎఫెక్ట్.. ఏపీ సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు..!
Follow us

| Edited By:

Updated on: Jun 06, 2020 | 3:06 PM

కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులకు ప్రత్యేక నిబంధనలు విధించింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో ప్రతి ఉద్యోగి ఆరోగ్య సేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆదేశించింది. ఆ యాప్ ఉన్న వారిని మాత్రమే సచివాలయంలోకి అనుమతించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి తప్పనిసరిగా కార్యాలయానికి బయల్దేరే ముందు ఆరోగ్య సేతు యాప్‌లో తన ఆరోగ్య పరిస్థితిని, లక్షణాలను స్టోర్ చేయాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆఫీసుకు వెళ్లే ముందు ‘సేఫ్, లో రిస్క్‌’ అని సందేశం వచ్చినప్పుడు మాత్రమే కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుందని వెల్లడించారు. ఇక హై రిస్క్ జోన్లలో ఉన్న ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసే అవకాశం కల్పించినట్లు అందులో పేర్కొన్నారు.

అలాగే విధులకు హాజరయ్యేవారు కచ్చితంగా థర్మల్ స్క్రీనింగ్ టెస్ట్‌లు చేయించుకోవాలని శానిటైజర్లు, మాస్కులు వినియోగించి జాగ్రత్తలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో సూచించారు. కాగా కరోనా తాజా సమాచారంతో పాటు వైరస్ వ్యాప్తి చెందకుండా పాటించాల్సిన జాగ్రత్తలు, కేంద్రం అనుసరిస్తోన్న నియంత్రణ చర్యలు తదితర అంశాలు ఆరోగ్య సేతు యాప్‌లో ఉండనున్నాయి. ఈ యాప్‌ను ప్రతి ఉద్యోగి తప్పనిసరిగా వాడేలా కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేయడం ద్వారా కరోనా వ్యాప్తిని పసిగట్టి తదుపరి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

Read This Story Also: కేరళ ఏనుగు పోస్ట్‌మార్టం రిపోర్టు.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!