AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Vaccine: వ్యాక్సిన్‌ ఇంజెక్షన్‌లానే ఉండాలా..? ‘క్యాప్సుల్‌ వ్యాక్సిన్‌’ పై పరిశోధనలు ముమ్మరం..

A New Generation Of Corona Vaccine: ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్‌ రూపంలోనే అందిస్తున్నారని మనకు తెలిసిందే. అయితే ఇంజెక్షన్‌లా కాకుండా ముక్కు ద్వారా స్ప్రే చేసుకునేలా ఉండే వ్యాక్సిన్‌పై ఇప్పటికే ప్రయోగాలు మొదలయ్యాయి...

Corona Vaccine: వ్యాక్సిన్‌ ఇంజెక్షన్‌లానే ఉండాలా..? 'క్యాప్సుల్‌ వ్యాక్సిన్‌' పై పరిశోధనలు ముమ్మరం..
Covid Vaccine In Capsule Fo
Narender Vaitla
|

Updated on: Mar 23, 2021 | 7:29 AM

Share

A New Generation Of Corona Vaccine: గతేడాది యావత్‌ మానవాళిని భయపెట్టించిన కరోనా మహమ్మారి ధీటుగా ఎదుర్కునే క్రమంలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ప్రపంచ దేశాలన్నింటిలో భారత్‌ ఈ వ్యాక్సిన్‌ తయారీలో ముందువరుసలో నిలిచింది. భారత దేశంలో తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరు సంపాదిచుకున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఈ ప్రక్రియలో వేగం పెగుగుతోంది. అయితే ఇప్పటి వరకు వ్యాక్సిన్‌ను ఇంజెక్షన్‌ రూపంలోనే అందిస్తున్నారని మనకు తెలిసిందే. అయితే ఇంజెక్షన్‌లా కాకుండా ముక్కు ద్వారా స్ప్రే చేసుకునేలా ఉండే వ్యాక్సిన్‌పై ఇప్పటికే ప్రయోగాలు మొదలయ్యాయి. అంటే జలుబు చేసినప్పుడు మనం ముక్కులో స్ప్రే చేసుకున్నట్లు చేసుకుంటే సరిపోద్ది. ఇదిలా ఉంటే పరిశోధకులు ఇంతటితో ఆగకుండా మరో అడుగు ముందుకేస్తున్నారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్‌ను మరింత సులభతరం చేసేలా.. ఏకంగా ఒక సాధారణ ట్యాబ్లెట్‌ (క్యాప్సుల్‌) రూపంలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ క్రమంలో భారత్‌కు చెందిన ప్రెమాస్‌ బయోటెక్‌ సంస్థ నోటి ద్వారా తీసుకునే కరోనా వ్యాక్సిన్‌ కోసం ప్రయోగాలు ముమ్మరం చేసింది. క్యాప్సుల్‌ రూపంలో ఉండే ఈ వ్యాక్సిన్‌ను కేవలం సింగిల్‌ డోస్‌లాగా తీసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. ‘ఒరావాక్స్‌’ పేరుతో తీసుకుకొస్తున్న ఈ వ్యాక్సిన్‌ను ఇప్పటికే జంతువులపై ప్రయోగించిన శాస్ర్తవేత్తలు మంచి ఫలితాన్ని ఇచ్చాయని తెలిపారు. వైరస్‌ను ఎదుర్కోవడంతో పాటు యాంటీబాడీలను ఉత్పత్తి చేయడంలో ఈ వ్యాక్సిన్‌ ఉపయోగపడనుందని ప్రెమాస్‌ తెలిపింది. అనమతులు లభిస్తే రాబోయే రెండు, మూడు నెలల్లోనే క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పుకొచ్చారు. ఒకవేళ క్యాప్సుల్‌ రూపంలో ఉండే ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే.. రవాణతో పాటు పంపిణీ కూడా సులభంగా మారుతుందని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Covishield : కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం, ఫస్ట్‌ – రెండో డోస్‌ మధ్య గ్యాప్‌ పెంచాలని లేఖలు

Corona vaccine: కరోనా కట్టడికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సరైనదే.. అమెరికాలో ఎలాంటి ఫలితాలు వచ్చాయంటే..?

COVID-19 vaccine: భారత్ ఆపన్నహస్తం.. 76 దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ: కేంద్రమంత్రి హర్షవర్ధన్