AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు..కాకినాడ తీరంలో 2 విదేశీ కార్గో షిప్ లు ..

ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా 40కి చేరాయి. ఈ ఒక్క రోజే 17 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ 17 మందిలో చాలా మంది ...

ఏపీలో కొత్తగా 17 కరోనా పాజిటివ్ కేసులు..కాకినాడ తీరంలో 2 విదేశీ కార్గో షిప్ లు ..
Jyothi Gadda
|

Updated on: Mar 31, 2020 | 12:13 PM

Share

ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా 40కి చేరాయి. ఈ ఒక్క రోజే 17 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం క‌ల‌క‌లం రేపుతోంది. ఆ 17 మందిలో చాలా మంది ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే ఉన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మొత్తం 147 శాంపిళ్ల‌ను పరీక్షిస్తే వాటిలో 17 కేసులు పాజిటివ్ వచ్చినట్లు బులిటెన్ లో వెల్ల‌డించారు.

జిల్లాల వారీగా మొత్తం కేసులు ప‌రిశీలించిన‌ట్లైతే.. ప్రకాశం 11, గుంటూరు 9, విశాఖ 6, కృష్ణా 5, తూర్పుగోదావ‌రి 4, అనంతపురం 2, నెల్లూరు, చిత్తూరు, కర్నూల్ జిల్లాలో ఒక్కొక్కటి అనంతపురం జిల్లాలో పదేళ్ల బాలుడికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజా కేసుల్లో 9 మంది డిల్లీ సమావేశంలో పాల్గొన్న వారు కాగా, మరో ఐదుగురు వారి బంధువులు, కాంటాక్ట్ కేసులు ఉన్న‌ట్లుగా వైద్య ఆరోగ్య శాఖ స్ప‌ష్టం చేసింది.

కాకినాడ తీరంలో హల్దియా, ఇండోనేసియాకు చెందిన కార్గో షిప్ లు.. మ‌రోవైపు కాకినాడ తీరం లో హాల్దియా, ఇండోనేషియా కు చెందిన రెండు కార్గో షిప్ లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. అధికారులు ఓడ సిబ్బందిని బయటకు రానీయకుండా షిప్ లోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజులు క్వారంటైన్ విధించారు. షిప్ నుంచి కిందకు దిగవద్దని విదేశీయులకు అధికారులు సూచించారు. ఈ నేప‌థ్యంలో రాష్ట్ర‌వ్యాప్తంగా హై టెన్ష‌న్ నెల‌కొంది. రాబోవు రోజుల్లో క‌రోనా మ‌హ‌మ్మారి ఏం స్థాయిలో విస్త‌రిస్తోంద‌న‌నే భ‌యందోళ‌న‌లో ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటున్నారు.

Follow Us
కళ్ల కింద వాపుతో బాధపడుతున్నారా? నిపుణులు సూచించే కారణాలు, నివారణ
కళ్ల కింద వాపుతో బాధపడుతున్నారా? నిపుణులు సూచించే కారణాలు, నివారణ
ట్రైన్ నడుపుతున్నప్పుడు లోకో పైలట్‌కు వాష్‌రూమ్ వస్తే ఏం చేస్తారు
ట్రైన్ నడుపుతున్నప్పుడు లోకో పైలట్‌కు వాష్‌రూమ్ వస్తే ఏం చేస్తారు
యానాం మార్కెట్‌లో అరుదైన చీరమేను సందడి!
యానాం మార్కెట్‌లో అరుదైన చీరమేను సందడి!
టీమిండియాకు బిగ్ షాక్..ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ శుభమన్ గిల్
టీమిండియాకు బిగ్ షాక్..ప్రాక్టీస్‌లో గాయపడిన కెప్టెన్ శుభమన్ గిల్
దమ్ము దైర్యం ఉండాలి.. దేవతలతో పెట్టుకోకండి..
దమ్ము దైర్యం ఉండాలి.. దేవతలతో పెట్టుకోకండి..
ట్రాఫిక్ ఆంక్షలతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు..!
ట్రాఫిక్ ఆంక్షలతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు..!
మందార పువ్వులతో ఇంట్లోనే ఫేస్ ప్యాక్..ముడతలు పోయి, మెరుపు ఖాయం!
మందార పువ్వులతో ఇంట్లోనే ఫేస్ ప్యాక్..ముడతలు పోయి, మెరుపు ఖాయం!
కవలల బయోమెట్రిక్ చూసి సిస్టమ్ షాక్..!
కవలల బయోమెట్రిక్ చూసి సిస్టమ్ షాక్..!
ముఖానికి విటమిన్ E క్యాప్సూల్ నేరుగా రాస్తున్నారా? నిపుణుల సూచన
ముఖానికి విటమిన్ E క్యాప్సూల్ నేరుగా రాస్తున్నారా? నిపుణుల సూచన
రూ.5 వేలతోనే ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌.. 4 గంటల్లోనే ఛార్జింగ్‌
రూ.5 వేలతోనే ఎలక్ట్రిక్ స్కూటర్ బుకింగ్‌.. 4 గంటల్లోనే ఛార్జింగ్‌