దేశంలో కరోనా విలయ తాండవం.. తాజా వివరాలు ఇవే..
కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాకపోవడంతో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటి మార్క్‌ను..

కరోనా మహమ్మారి దేశంలో విలయ తాండవం చేస్తోంది. ఇప్పటి వరకు వ్యాక్సిన్ రాకపోవడంతో వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కోటి మార్క్‌ను దాటేసిన సంగతి తెలిసిందే. ఇక మన దేశంలో కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇప్పటికే ఐదు లక్షలు దాటి ఆరు లక్షలకు చేరువలో ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 18,653 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 5,85,493కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 2,20,114 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,47,979 మంది కోలుకుని.. ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. గడిచిన 24 గంటల్లో కరోన బారినపడి 507 మంది మరణించారని.. దీంతో ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా బారినపడి 17,400 మంది మరణించారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, గుజరాత్, తెలంగాణ ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి.



