చంద్రయాన్-3 కి ఇన్సూరెన్స్..

ఇస్రో చంద్రయాన్ 3 కోసం సరికొత్త అడుగులు వేయబోతుంది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ప్రయోగానికి ఇన్సూరెన్స్ చేయించబోతోంది. గతంలో భారత్.. ఇతర దేశాల నుంచి ఉపగ్రహాలను పంపిన సమయంలోనే ఇన్సూరెన్స్ చేయించిన దాఖలాలున్నాయి.  వాస్తవానికి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో..ఏ దేశం చేయనన్నీ ప్రయోగాలు చాలా తక్కువ ఖర్చులో చేస్తోంది. ఈ విషయంలో భారత్‌ను ప్రపంచ దేశాలు అభినందించాయి కూడా. కానీ ఇటీవల చేసిన చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ కాని నేపథ్యంలో ఇస్రో […]

చంద్రయాన్-3 కి ఇన్సూరెన్స్..
Follow us

|

Updated on: Nov 22, 2019 | 1:47 PM

ఇస్రో చంద్రయాన్ 3 కోసం సరికొత్త అడుగులు వేయబోతుంది. ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా ప్రయోగానికి ఇన్సూరెన్స్ చేయించబోతోంది. గతంలో భారత్.. ఇతర దేశాల నుంచి ఉపగ్రహాలను పంపిన సమయంలోనే ఇన్సూరెన్స్ చేయించిన దాఖలాలున్నాయి.  వాస్తవానికి భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం ఇస్రో..ఏ దేశం చేయనన్నీ ప్రయోగాలు చాలా తక్కువ ఖర్చులో చేస్తోంది. ఈ విషయంలో భారత్‌ను ప్రపంచ దేశాలు అభినందించాయి కూడా. కానీ ఇటీవల చేసిన చంద్రయాన్ 2 ప్రయోగం సక్సెస్ కాని నేపథ్యంలో ఇస్రో తగు జాగ్రత్తలు తీసుకుంటుంది. కాగా 2020 లో లాంచ్ చేయబోతున్న చంద్రయాన్ 3 ప్రయోగం కోసం ఇస్రో.. ప్రస్తుతం పక్కా వ్యూహాలు రచిస్తోంది.

ఇన్సూరెన్స్ చేయించడం మంచిదే కానీ అది చాలా ఖర్చుతో కూడుకున్న పని. మొత్తం ప్రయోగానికి అయ్యే ఖర్చులో దాదాపు 25 శాతం ప్రీమియంగా చెల్లించాలి. ఇక బీమా చేసే ఒకే ఒక్క కంపెనీ అయిన ‘న్యూ ఇండియా అష్యూరెన్స్‌‌‌‌’ కూడా ప్రభుత్వానికి చెందినదే. ఆ సొమ్ము కూడా ప్రభత్వ ఖజానా నుంచే విడుదల చెయ్యాలి. అందుకే ఇప్పటివరకు అలాంటి ప్రయత్నాలు చెయ్యలేదు. సో ముందు..ముందు ఆ భారం కూడా ప్రజలపై పన్నుల రూపంలో పడనుంది. తిరువనంతపురం ఆధారిత విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్ ఎస్ సోమనాథ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.