YSR Aarogyasri Trust Jobs 2022: నెల్లూరు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రాస్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..అర్హతలివే!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయం (Nellore District).. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర పోస్టుల (Arogya Mitra Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

YSR Aarogyasri Trust Jobs 2022: నెల్లూరు వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రాస్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌..అర్హతలివే!
Ysr Aarogyasri Health Trust

Updated on: May 14, 2022 | 10:10 AM

YSR Aarogyasri Health Care Trust Recruitment 2022: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయం (Nellore District).. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ పోస్టుల (Arogya Mitra Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 21

ఇవి కూడా చదవండి

పోస్టుల వివరాలు:

  • ఆరోగ్య మిత్ర పోస్టులు: 20

అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్‌)/ఎమ్మెస్సీ (నర్సింగ్‌)/బీఫార్మసీ/బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా కమ్యునికేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.15,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  • టీమ్‌ లీడర్‌ పోస్టులు: 1

అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్‌)/ఎమ్మెస్సీ (నర్సింగ్‌)/బీఫార్మసీ/బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంతేకాకుండా కమ్యునికేషన్‌ నైపుణ్యాలు, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ కూడా ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.18,500ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్: జిల్లా కో ఆర్డినేటర్‌, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌, ప్రభుత్వ ఆసుపత్రి, దర్గామిట్ట, నెల్లూరు, ఏపీ.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 23, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Also Read:

AP Anganwadi Jobs 2022: టెన్త్‌ అర్హతతో.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో భారీగా అంగన్‌వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్..