WCL Recruitment: బెస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ రంగానికి చెందిన కోల్ ఇండియా లిమిటెడ్ సబ్సిడరీ సంస్థ అయిన డబ్ల్యూసీఎల్ మొత్తం 211 ఖాళీలను భర్తీ చేయనుంది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
* 211 ఖాళీలకు గాను మైనింగ్ సిర్దార్ (167), సర్వేయర్ (మైనింగ్) 44 ఖాళీలు ఉన్నాయి.
* మైనింగ్ సిర్దార్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డీజీఎంఎస్ జారీ చేసిన వాలిడ్ మైనింగ్ సిర్దార్ సర్టిఫికేట్ లేదా మైనింగ్ / మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్థత పొందిఉండాలి.
* అభ్యర్థుల వయసు 11-10-2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* సర్వేయర్ (మైనింగ్) పోస్టుకు దరఖాస్తు చేసుకునే వారు పదో తరగతితో పాటు డీజీఎంఎస్ జారీ చేసిన సర్వేయర్స్ సర్టిఫికెట్ లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 11-10-2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
* పరీక్ష మొత్తం 10 మార్కులకు నిర్వహిస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ 21-10-2021 ప్రారంభమవుతుండగా, 20-11-2021తో ముగియనుంది.
* నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి..
Fruit Prices: నవరాత్రుల సందర్భంగా పెరిగిన పండ్ల ధరలు.. కొనాలంటే జేబు ఖాళీ కావాల్సిందే..