తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలోని మహిళలు, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మిషన్ శక్తి పథకం (సమగ్ర మహిళా సాధికారత కార్యక్రమం) కింద.. ఒప్పంద ప్రాతిపదికన జిల్లా మిషన్ కోఆర్డినేటర్, స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ, మల్టీ పర్పస్ స్టాఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి పదో తరగతి, సోషల్ సైన్సెస్/న్యూట్రీషన్/మెడిసిన్/హెల్త్ మేనేజ్‌మెంట్/సోషల్ వర్క్/రూరల్ మేనేజ్‌మెంట్/ఎకనామిక్స్/బ్యాంకింగ్ స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం మూడేళ్ల అనుభవం కూడా ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 1, 2023వ తేదీ నాటికి 25 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి కలిగిన వారు ఆఫ్‌లైన్ విధానంలో మార్చి 29, 2023వ తేదీలోపు కింది అడ్రస్‌లో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,600ల నుంచి రూ.38,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌చేసుకోవచ్చు.
The District Collector/Chairman, Women Child Handicapped and Elderly Welfare Department, Room No.16, Collectorate, Durajpally, Suryapet, Telangana.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.