UPSC Recruitment 2022: రాత పరీక్షలేకుండా యూపీఎస్సీ ద్వారా కేంద్ర కొలువులు సాదించే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..

|

Sep 25, 2022 | 7:33 AM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న.. 52 ప్రాసిక్యూటర్ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌), స్పెషలిస్ట్ గ్రేడ్-3 (జనరల్ మెడిసిన్) తదితర (Prosecutor Posts) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన..

UPSC Recruitment 2022: రాత పరీక్షలేకుండా యూపీఎస్సీ ద్వారా కేంద్ర కొలువులు సాదించే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..
Upsc
Follow us on

UPSC Prosecutor Recruitment 2022: భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఖాళీగా ఉన్న.. 52 ప్రాసిక్యూటర్ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌), స్పెషలిస్ట్ గ్రేడ్-3 (జనరల్ మెడిసిన్) తదితర (Prosecutor Posts) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్‌ డిగ్రీ, పీజీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో అక్టోబర్‌ 13, 2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25లు దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. షార్ట్‌ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ప్రాసిక్యూటర్ (సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌) పోస్టులు: 12
  • స్పెషలిస్ట్ గ్రేడ్-3 (జనరల్ మెడిసిన్) పోస్టులు: 28
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (ఆయుర్వేదం) పోస్టులు: 1
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ (యునాని) పోస్టులు: 1
  • వెటర్నరీ ఆఫీసర్ పోస్టులు: 10

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.