UPSC Recruitment 2022: యూపీఎస్సీ కేంద్ర కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే జాబ్‌ కొట్టడం సులువు..

|

Aug 15, 2022 | 7:50 AM

భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో.. 37 అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ తదితర (Assistant Director Posts) తదితర పోస్టుల భర్తీకి..

UPSC Recruitment 2022: యూపీఎస్సీ కేంద్ర కొలువులకు నోటిఫికేషన్‌ విడుదల.. ఈ అర్హతలుంటే జాబ్‌ కొట్టడం సులువు..
UPSC Recruitment 2022
Follow us on

UPSC Senior Grade of Indian Information Service Recruitment 2022: భారత ప్రభుత్వ విభాగానికి చెందిన యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల్లో.. 37 అసిస్టెంట్ డైరెక్టర్, డిప్యూటీ డైరెక్టర్, సైంటిఫిక్‌ ఆఫీసర్‌ తదితర (Assistant Director Posts) తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, బీఈ/బీటెక్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డాక్టరేట్, ఎల్‌ఎల్‌బీ, మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు జులై 31, 2022 నాటికి 50 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఎవరైనా ఆన్‌లైన్‌ విధానంలో సెప్టెంబర్‌ 1, 2022 తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.25లు దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ/మహిళలకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇతర వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు: 2
  • డిప్యూటీ డైరెక్టర్ పోస్టులు: 4
  • సైంటిఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • సీనియర్ ఫోటోగ్రాఫిక్ ఆఫీసర్ పోస్టులు: 1
  • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (ఫిజిక్స్) పోస్టులు: 1
  • జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూట్రాన్) పోస్టులు: 1
  • సీనియర్ గ్రేడ్ ఆఫ్‌ ఇండియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ పోస్టులు: 22
  • ప్రిన్సిపాల్ పోస్టులు: 1
  • డైరెక్టర్‌ పోస్టులు: 1
  • ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్/ సర్వేయర్ ఆఫ్ వర్క్స్ (సివిల్) పోస్టులు: 2

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.