యూపీఎస్సీ- నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ ఎగ్జామ్ (2)-2023కు రెండో విడదల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏటా రెండు సార్లు ఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సారి మొత్తం 370 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిల్లో అందులో నేషనల్ డిఫెన్స్ అకాడమీ పోస్టులు 370 (ఆర్మీ-208, నేవీ-42, ఏయిర్‌ఫోర్స్- 120) ఉన్నాయి. వాటిలో 28 గ్రౌండ్ డ్యూటీకి సంబంధించిన ఖాళీలు. నేవల్ అకాడమీ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) ఖాళీలు 25 ఉన్నాయి. ప్రతీ ఏట రెండు సార్లు యూపీఎస్సీ ఎన్డీఏ, ఎన్‌ఏ ప్రవేశాలకు నియామక ప్రక్రియ నిర్వహిస్తోంది. 2023 విద్యా సంవత్సరానికిగాను త్రివిధ దళాల్లో ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్ తాజాగా వెలువడింది. 2024 జులై 2 నుంచి152వ కోర్సులో, 114వ ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. అర్హులైన అవివాహిత యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆర్మీ వింగ్ పోస్టులకు ఏదైనా గ్రూపులో ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఎయిర్ ఫోర్స్, నేవీ పోస్టులకు ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక కొలతలు కూడా ఉండాలి. ఎన్‌ఏ (10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్) కోర్సులకు కేవలం పురుషులు మాత్రమే అర్హులు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా జనవరి 1, 2005 నుంచి జనవరి 1, 2008ల మధ్య జన్మించి ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు ఉంటుంది.
రెండు దశల్లో ఎంపిక చేస్తారు. మొదటి దశలో.. రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ – పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్/ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 900 మార్కులకు రాత పరీక్ష.. రెండు పేపర్లకు ఉంటుంది. పేవర్-1 మ్యాథమేటిక్స్‌లో 300 మార్కులకుగానూ 2 గంటల్లో పరీక్ష ఉంటుంది. పేపర్-2 జనరల్ ఎబిలిటీ- 600 మార్కులకు రెండున్నర గంటల సమయంలో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.
రాత పరీక్షలో అర్హత పొందిన వారికి యూపీఎస్సీ ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్టులను ఎస్‌ఎస్‌బీ నిర్వహిస్తుంది. ఈ విభాగానికీ 900 మార్కులు ఉంటాయి. ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్, పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్ర్కిప్షన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టులు, గ్రూప్ డిస్కషన్ నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఎస్‌ఎస్‌బీ నిర్వహించిన ఇంటర్వ్యూలో వచ్చిన మొత్తం మార్కుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.