UPSC Mains 2022 Result: కీలక ప్రకటన విడుదల చేసిన యూపీఎస్సీ! ఆ ఫలితాలు విడుదలైన వెంటనే..

|

Nov 25, 2022 | 2:56 PM

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌-2022 ఫలితాలు త్వరలో విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించిన తర్వాత అనుసరించవల్సిన విధివిధానాలకు..

UPSC Mains 2022 Result: కీలక ప్రకటన విడుదల చేసిన యూపీఎస్సీ! ఆ ఫలితాలు విడుదలైన వెంటనే..
UPSC CSE Mains 2022 Result
Follow us on

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్‌-2022 ఫలితాలు త్వరలో విడుదలకానున్నాయి. ఈ నేపథ్యంలో మెయిన్స్‌ ఫలితాలు ప్రకటించిన తర్వాత అనుసరించవల్సిన విధివిధానాలకు సంబంధించి కమిషన్ గురువారం (నవంబర్‌ 24) ప్రకటన జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ (మెయిన్) పరీక్ష-2022 ఫలితాలు విడుదలైన తర్వాత అర్హత సాధించిన వారికి యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ లో డీటైల్డ్‌ అప్లికేషన్‌ ఫాం-2 (డీఏఎఫ్‌-II) అందుబాటులో ఉంటుందని, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేసుకోవల్సి ఉంటుందని సూచించింది.

సివిల్‌ సర్వీసెస్‌ నియామక ప్రక్రియలో.. మెయిన్స్‌ రాత పరీక్షల అనంతరం పర్సనల్ టెస్ట్‌/ఇంటర్వ్యూ జరుగుతుంది. దీనికి హాజరయ్యే వారు తప్పనిసరిగా డీఏఎఫ్‌-II అప్లికేషన్‌ను పూరించవలసి ఉంటుంది. లేదంటే ఇంటర్వ్యూకి అనుమతింపబడరు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ, డిగ్రీ, ఇతర అన్ని ఓరిజినల్‌ డాక్యుమెంట్లతోపాటు, ఫొటోకాఫీలను కూడా సిద్ధం చేసుకోవల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రకటన జారీ చేసింది. మెయిన్స్‌ ఫలితాలు ప్రకటన అనంతరం ఇంటర్వ్యూ తేదీలు తెలియజేస్తామని వివరించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.