UOH Recruitment: యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక‌..

| Edited By: Anil kumar poka

Jan 12, 2022 | 8:37 AM

UOH Recruitment 2022: యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో ఉన్న ఈ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యంలోని స్కూల్‌ ఆఫ్‌...

UOH Recruitment: యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక‌..
Follow us on

UOH Recruitment 2022: యూనివ‌ర్సిటీ ఆఫ్ హైద‌రాబాద్‌లో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేశారు. హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలిలో ఉన్న ఈ కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యంలోని స్కూల్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ విభాగంలో పోస్టులు ఉన్నాయి. కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. నోటిఫికేష‌న్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు..

భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు, అర్హ‌త‌లు..

* నోటిఫికేష‌న్‌లో భాగంగా మొత్తం 04 గెస్ట్ ఫ్యాక‌ల్టీ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు.

* ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్‌) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు నెట్‌/ స్లెట్‌ అర్హత సాధించి ఉండాలి.

* స్టాటిస్టిక్స్‌లో పీహెచ్‌డీ డిగ్రీ చేసిన వారికి ప్రాధాన్య‌త‌ ఉంటుంది.

ముఖ్య‌మైన విషయాలు..

* ఆస‌క్తి, అర్హ‌త ఉన్న అభ్య‌ర్థులు ఈమెయిల్‌ విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్య‌ర్థులు పూర్తి వివ‌రాల‌తో కూడిన ద‌ర‌ఖాస్తుల‌ను deansm@uohyd.ac.in మెయిల్ ఐడీకి పంపించాల్సి ఉంటుంది.

* ఎంపికైన అభ్య‌ర్థుల‌కు ఒక లెక్చర్‌కి రూ. 1500 లేదా నెలకి రూ.50,000 చొప్పున చెల్లిస్తారు.

* అభ్య‌ర్థుల‌ను ముందుగా ప‌ని అనుభ‌వం ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంత‌రం ఇంట‌ర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ‌కు 24-01-2022ని చివ‌రి తేదీగా నిర్ణ‌యించారు.

* పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి..

Also Read: IND vs SA: 223 పరుగులకే చాప చుట్టేసిన భారత్.. కెప్టెన్ ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ..

Prabhas: అనుకున్న సమయానికే ప్రేక్షకులముందుకు తీసుకువస్తాం.. ప్రభాస్ సినిమా పై నిర్మాత ఇంట్రస్టింగ్ కామెంట్స్..

PM Narendra Modi: దేశంలో మరో లాక్‌డౌన్..? 13న సీఎంలతో ప్రధాని మోదీ కీలక సమావేశం..