UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..

|

Nov 27, 2021 | 8:33 PM

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న...

UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వశాఖల్లో ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలు..
Upsc
Follow us on

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ (యూపీఎస్సీ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఉన్న టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయో విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, ట్యూటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* కంట్రోల్‌ సిస్టమ్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్, మెటాలర్జీ/ ప్రొడక్షన్‌ ఇంజనీరింగ్ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టుల ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీటితో పాటు సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

* అభ్యర్థుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రిక్రూట్‌మెంట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 16-12-2021ని చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Also Read: Tomato Prices Falling: ఏపీలో అక్కడ ఒక్కసారిగా పడిపోయిన టమాటా ధర.. కిలో రూ.10 నుంచి రూ.27 మాత్రమే..

ఇన్‏స్టాగ్రామ్‏లో ఐఫోన్ ట్రెండ్ మాములుగా లేదుగా.. తెగ అట్రాక్ట్ అవుతున్న సెలబ్రిటీస్.. వీడియోస్ వైరల్..

Manchu Vishnu: ‘మా’ ఎన్నికల హామీని నెరవేర్చే దిశగా మంచు విష్ణు.. పలు ఆస్పత్రులతో ఒప్పందాలు..