UCIL Recruitment 2022: టెన్త్/ఐటీఐ అర్హతతో.. యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో 239 అప్రెంటిస్ ఖాళీలు..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ మంత్రిత్వశాఖకు చెందిన జార్ఖండ్‌లోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.. 239 ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్/మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానికల్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ తదితర ట్రేడుల్లో ఖాళీలున్నాయి.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో 50 శాతం మార్కులతోఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు నవంబర్ 30, 2022వ తేదీ నాటికి 18 నుంచి 25 యేళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితి విషయంలో సడలింపు వర్తిస్తుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నవంబర్ 30, 2022వ తేదీలోపు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ సమయంలో జనరల్/ఓబీసీ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.800ల రిజిస్ట్రేషన్ ఫీజు కింద డిమాండ్ డ్రాఫ్ట్‌ను సమర్పించవల్సి ఉంటుంది. విద్యార్హతలు, మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.56,100ల జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.