TV9 & KAB Education Expo 2025: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్ధులకు అలర్ట్.. నేటి నుంచే టీవీ9 ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ప్రారంభం!

TV9 నెట్‌వర్క్, KAB సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2025 ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఇంటర్మీడియట్, డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే లక్ష్యంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం శుక్రవారం (మే 23) నుంచి హైదారబాద్‌లో ప్రారంభం అవుతుంది..

TV9 & KAB Education Expo 2025: తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్ధులకు అలర్ట్.. నేటి నుంచే టీవీ9 ఎడ్యుకేషన్‌ ఫెయిర్‌ ప్రారంభం!
TV9 & KAB Education Expo 2025

Updated on: May 23, 2025 | 12:32 PM

హైదరాబాద్‌, మే 23: ఇంటర్‌, డిప్లొమా తర్వాత ఏ కోర్సు తీసుకోవాలో అర్ధం కావట్లేదా? కెరీర్‌ ఆప్షన్లపై సందేహాలా? మరేం పర్వాలేదు.. విద్యార్ధుల కోసం తెలుగు రాష్ట్రాల్లో దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్‌ ఎక్స్ పో నేటి నుంచి జరుగుతుంది. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులకు ఎంట్రీ కూడా పూర్తిగా ఉచితమే. TV9 నెట్‌వర్క్, KAB సంయుక్తంగా ఈ ఎడ్యుకేషన్ ఎక్స్‌పో 2025ను నిర్వహిస్తోంది. ఇంటర్మీడియట్, డిప్లొమా విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసే లక్ష్యంగా దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ కార్యక్రమం శుక్రవారం (మే 23) నుంచి హైదారబాద్‌లో ప్రారంభం అవుతుంది. ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, రాజ్‌కోట్, వడోదర, బెంగళూరు, హుబ్బళ్లి, గుల్బర్గా, పాట్నా, కోల్‌కతా, గౌహతి, పూణే, హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌తో సహా దేశంలోని మొత్తం15 ప్రధాన నగరాల్లో ఈ ఎడ్యుకేషన్ ఎక్స్ పో జరుగుతుంది. ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ హైదరాబాద్‌లో మే 23 నుంచి 25 వరకు 3 రోజులపాటు హైటెక్ సిటీలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోని హాల్ నంబర్ 1లో జరుగుతుంది. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఈ ఎడ్యుకేషన్ ఎక్స్‌పోకి హాజరుకావచ్చు.

ఈ మెగా ఎడ్యుకేషన్ ఫెయిర్ విద్యార్థులకు ఉన్నత విద్యా కోర్సుల గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తుంది. ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ, బిజినెస్ మేనేజ్‌మెంట్ నుంచి హోటల్ మేనేజ్‌మెంట్, వ్యవసాయం, ఫ్యాషన్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కోర్సుల వరకు విస్తృత శ్రేణి కెరీర్ అవకాశాలను ఇక్కడ నిపుణులను అడిగి స్వయంగా తెలుసుకోవచ్చు. అలాగే విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు కూడా ఈ ఎక్స్‌పోలో దిశానిర్దేశం చేస్తారు. విద్యార్ధులకు ఉచితంగా నిపుణుల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ కూడా ఇస్తారు. ముఖ్యంగా EAPCET, ECET, JoSAA, NEET వంటి కీలక ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు వెబ్ కౌన్సెలింగ్, స్కోర్‌ల ఆధారంగా ఏయే ఎంపికలు అందుబాటులో ఉంటాయో వంటి వివరాలు తెలుసుకోవడానికి సహాయపడుతుంది. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలతో పాటు ఈ ఎక్స్‌పోకు హాజరు కావచ్చు.

ఇవి కూడా చదవండి

ఏ తేదీల్లో ఎక్కడెక్కడంటే..

  • హైదరాబాద్: మే 23 నుంచి 25 వరకు, 2025.
    వేదిక: హాల్ నెంబర్ 1, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్, హైటెక్ సిటీ, హైదరాబాద్.
  • విశాఖపట్నం: జూన్ 1, 2025.
    వేదిక: చిల్ట్రన్ అరేనా (Children Arena)
  • విజయవాడ: మే 31, జూన్ 1 తేదీల్లో 2025.
    వేదిక: ఎస్ఎస్‌ కన్వెన్షన్‌ (SS Convention)

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.