హైదరాబాద్, జులై 23: తెలంగాణ భూగర్భజలశాఖలో వివిధ నాన్‌గెజిటెడ్ పోస్టుల భర్తీకి నిర్వహించవల్సిన రాత పరీక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు సంబంధించిన కొత్త తేదీని టీఎస్పీయస్సీ తాజాగా ప్రకటించింది. తాజా ప్రకటన ప్రకారం జులై 31న ఆన్‌లైన్ విధానంలో పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు నేటి నుంచి వెబ్‌సైట్‌ల్ అందుబాటులో ఉంటాయి.
కాగా జీహెచ్‌ఎంసీ పరిధిలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా భూగర్భజలశాఖలో నాన్‌గెజిటెడ్ పోస్టుల రాత పరీక్షలు వాయిదా వేస్టున్నట్లు ప్రకటించిన టీఎస్పీయస్సీ కొత్త తేదీని ప్రకటించింది.
మరిన్ని కెరీర్ సంబంధిత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.