TSPSC Results 2024: టీఎస్‌పీఎస్సీ పలు ఉద్యోగ రాత పరీక్షల ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి

|

Feb 22, 2024 | 8:30 AM

తెలంగాణ పలు ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగానికి చెందిన అకౌంట్స్‌ ఆఫీసర్స్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగాలు, అగ్రికల్చర్‌ అండ్‌ కోపరేటివ్‌ డిపార్టుమెంట్‌లోని అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు టీఎస్‌పీఎస్సీ..

TSPSC Results 2024: టీఎస్‌పీఎస్సీ పలు ఉద్యోగ రాత పరీక్షల ఫలితాలు విడుదల.. ఇక్కడ నేరుగా చెక్‌ చేసుకోండి
TSPSC
Follow us on

అమరావతి, ఫిబ్రవరి 22: తెలంగాణ పలు ఉద్యోగ రాత పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం (ఫిబ్రవరి 21) విడుదల చేసింది. మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ విభాగానికి చెందిన అకౌంట్స్‌ ఆఫీసర్స్‌, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగాలు, అగ్రికల్చర్‌ అండ్‌ కోపరేటివ్‌ డిపార్టుమెంట్‌లోని అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్ష ఫలితాలు టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్ధులు టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌ లో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు త్వరలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు నిర్వహిస్తామని తెలిపింది. గత యేడాది మే నెలలో అగ్రికల్చర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు, ఆగస్టులో అకౌంట్స్‌ ఆఫీసర్స్‌ పోస్టులకు రాత పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రకటించిన ఫలితాల్లో 12,186 మంది అభ్యర్థులకు ర్యాంకులు ప్రకటించారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాను త్వరలో విడుదల చేస్తామని, అభ్యర్ధులు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధంగా ఉంచుకోవాలని టీఎస్సీయస్సీ పేర్కొంది.

టీఎస్పీయస్సీ గ్రూప్‌-2, 3లో అదనపు పోస్టులు!

టీఎస్‌పీఎస్సీ 2022 గ్రూప్‌-2, గ్రూప్‌-3 నోటిఫికేషన్లలో అదనపు పోస్టులను కలిపేందుకు సర్కార్‌ ప్రయత్నాలు చేస్తోంది. గ్రూప్‌-1 మాదిరే ఈ రెండు ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ అదనంగా పోస్టులు కలపాలనేది ప్రభుత్వ యోచన. 2022 గ్రూప్‌-2 నోటిఫికేషన్‌లో 18 విభాగాల్లో 783 ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అప్పటి నుంచి ఇప్పటివరకు పెరిగిన పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే 2022 డిసెంబర్‌ 30న విడుదలైన గ్రూప్‌-3 నోటిఫికేషనకు కూడా అదనపు ఖాళీ పోస్టులు కలుపుకొని అనుబంధ నోటిఫికేషన్‌ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రూప్‌-3 కింద మొత్తం 1375 ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.