TSPSC JL Exam Dates 2023: తెలంగాణ జేఎల్‌ పరీక్షల తేదీలు ఇవే.. ఈ వారంలోనే హాల్ టికెట్లు విడుదల..

|

Sep 03, 2023 | 8:39 PM

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియలు వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాలకు ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ వచ్చేవారంలో మరో కీలక పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నియామక రాత పరీక్షలు..

TSPSC JL Exam Dates 2023: తెలంగాణ జేఎల్‌ పరీక్షల తేదీలు ఇవే.. ఈ వారంలోనే హాల్ టికెట్లు విడుదల..
TSPSC JL Exam Dates
Follow us on

హైదరాబాద్, సెప్టెంబర్ 3: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నియామక ప్రక్రియలు వడివడిగా జరుగుతున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాలకు ఆన్‌లైన్ రాత పరీక్షలు నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ వచ్చేవారంలో మరో కీలక పరీక్షను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నియామక రాత పరీక్షలు సెప్టెంబర్‌ 12 నుంచి ప్రారంభం మొదలవ్వనున్నాయి. సీబీటీ విధానంలో జరిగే ఈ పరీక్షలు వచ్చేనెల 3వ తేదీ వరకు జరగనున్నాయి. దాదాపు 1392 పోస్టులకు గానూ ఈ నియామక ప్రక్రియ జరుగుతోంది. 11 రోజులపాటు ఆయా తేదీల్లో 16 సబ్జెక్టుల్లో రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. ఉదయం సెషన్‌లో జనరల్ స్టడీస్ పేపర్, మధ్యాహ్నం సెషన్‌లో సంబంధిత సబ్జెక్టు పేపర్ పరీక్ష జరగుతుంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పరీక్ష తేదీలను విడుదల చేసింది.

కాగా తెలంగాణలో భారీ సంఖ్యలో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు భర్తీ చేయడం ఇదే తొలిసారి. 2008లో ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో (2008) 1100 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీ చేశారు. ప్రస్తుతం ఈ సంఖ్య కంటే అధికంగా 1392 పోస్టులను భర్తీ చేయడం విశేషం.

ఇవి కూడా చదవండి

సబ్జెక్టుల వారీగా ఆయా పరీక్షల తేదీలు ఇవే..

  • ఇంగ్లిష్‌ సబ్జెక్ట్ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 12, 2023
  • ఆర్థికశాస్త్రం, వృక్షశాస్త్రం పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 13, 2023
  • మ్యాథమెటిక్స్ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 14, 2023
  • కెమిస్ట్రీ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 20, 2023
  • తెలుగు పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 21, 2023
  • భౌతికశాస్త్రం, జంతుశాస్త్రం పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 22, 2023
  • కామర్స్ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 25, 2023
  • సివిక్స్, అరబిక్, ఫ్రెంచ్ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 26, 2023
  • హిందీ పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 27, 2023
  • హిస్టరీ, సంస్కృతం పరీక్ష నిర్వహించే తేదీ: సెప్టెంబర్ 29, 2023
  • ఉర్దూ పరీక్ష నిర్వహించే తేదీ: అక్టోబర్‌ 3, 2023

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.