తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్‌లో ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా రద్దయిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల నియామక పరీక్షను మళ్లీ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మే 8, 9 తేదీల్లో వివిధ శాఖల్లోని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనుంది. ఏఈఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లను మే 2న టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.in. నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయానికి 45 నిమిషాల ముందు వరకు అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
కాగా మొత్తం 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పోస్టుల భర్తీకి ఈ ఏడాది జనవరి 22న రాత పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఐతే పేపర్ లీకేజీ కారణంగా ఏఈఈ పరీక్షతోపాటు పలు పరీక్షలను టీఎస్పీయస్సీ రద్దు చేసింది. రద్దు చేసిన పరీక్షలన్నింటికీ కొత్త తేదీలన ప్రకటించి, మళ్లీ పరీక్ష నిర్వహించేందుకు సమాయాత్తమవుతోంది. పురపాలక శాఖలో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అసిస్టెంట్ల పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు తప్పులను సవరించుకునేందుకు మే 5వతేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.